Parasite In The Woman's Eye : ప్రపంచంలో ఎన్నో అరుదైన ఘటనలు వెలుగులోకి వస్తాయి. అలాంటి విషయాన్నే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మహిళ కొత్తగా ఏదైనా తిందామని మొసలి మాంసం ట్రై చేసింది. కష్టమైనా.. దాన్ని అరిగించుకుంది. కానీ, కథ అడ్డం తిరిగింది. కన్ను ఉబ్బిపోయింది. ఇంతకీ కన్ను ఉందా? పోయిందా?


కాంగోలో అరుదైన ఘటన


ఈ అరుదైన ఘటన కాంగోలోని బసంకుసులో జరిగింది. 28 ఏళ్ల మహిళ ఇటీవల కంటి సమస్యలో హాస్పిటల్ లో చేరింది. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె ఓక్యులర్ పెంటాస్టోమియాసిస్ అనే ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. పెంటాస్టోమిడ్స్ అని పిలువబడే పరాన్నజీవుల వల్ల కలిగే అరుదైన ఐ ఇన్ఫెక్షన్ గా గుర్తించారు. ఈ పరాన్నజీవి రోగి ఎడమ కన్ను పొరకింద ఉన్నట్లు తేల్చారు. ఈ జీవి దాదాపు 0.4 అంగుళాలపొడవు పెరిగింది. తాజాగా ఆపరేషన్ చేసి ఆ పరాన్న జీవిని తొలగించారు. ఈ పారాసైట్ లేత గోధుమ రంగులో C- ఆకారంలో ఉంది. దీన్ని ఆర్మిల్లిఫర్ గ్రాండిస్ జాతికి చెందినదని వైద్యులు గుర్తించారు.


కేవలం పాము జాతులలో ఉండే పరాన్ని జీవి ఓ మహిళ కంట్లోకి వెళ్లింది. రెండు సంవత్సరాల పాటు కంట్లోనే ఉండిపోయింది. కంటిపొర కిందే నివాసం ఏర్పాటు చేసుకుంది. కంటినొప్పితో హాస్పిటల్ కు వెళ్లిన మహిళకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి, అరుదైన పరాన్న జీవి ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ ద్వారా తొలగించారు. కంట్లోకి ఆ పరాన్న జీవి ఎలా వెళ్లింది? అనే విషయంపైనా స్టడీ చేశారు.


పాములలో నివాసం ఉండే పరాన్ని జీవి ఆర్మిల్లిఫెర్


నిజానికి ఆర్మిల్లిఫెర్ పరాన్న జీవులు తమ జీవిత చక్రం చివరి దశలో పాములలో నివాసం ఉంటాయి. కొండ చిలువల శ్వాసనాళాలలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు చివరికి ఊపిరితిత్తుల ద్వారా బయటకు వస్తాయి. పాము నోరు లేదంటే జీర్ణవ్యవస్థ ద్వారా కూడా బయటకు వస్తాయి. ఆ గుడ్లు కలిసి కలుషిత ఆహారం లేదా కలుషిత నీళ్లు తాగితే మనిషి శరీరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. పాము మాంసాన్ని తినే వారిలోకి ఈ పరాన్నజీవి ప్రవేశిస్తుంది. అయితే, సదరు బాధిత మహిళ తాను ఎప్పుడూ పాము మాంసం తినలేదని చెప్పింది. అయితే, మొసలి మాంసం తినే అలవాటు ఉన్నట్లు చెప్పింది. కానీ, ఇప్పటి వరకు మొసలి మాంసం తినే వారిలో ఆర్మిల్లిఫర్ ఓక్యులర్ ఇన్ఫెక్షన్ కేసును వైద్యులు ఎప్పుడూ గుర్తించలేదు. వైద్యశాస్త్రంలో ఇదే తొలి కేసుగా వెల్లడించారు. ఈ పరాన్ని జీవిలో మనిషిలో పలు రకాల కంటి వ్యాధులకు కారణం అవుతుంది. కళ్లు ఎరుపు కావడం, తీవ్రమైన నొప్పి, చూపు మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.


ఈ పరాన్న జీవులు మనిషి శరీరంలోకి రాకూడదంటే?


ఈ పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. పాములను పట్టుకోవడం లాంటివి చేస్తునప్పుడు తప్పుకుండా చేతులకు గ్లౌజులు ధరించాలంటున్నారు. సరిగా ఉడకని సరీసృపాల మాంసాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదంటున్నారు.


Read Also : మీరు మీ మొబైల్ ఫోన్‌ను ఇలా క్లీన్ చేస్తున్నారా? మీ విధానం చాలా తప్పు, ఇలా చేయడమే కరెక్ట్ !