Cell Phone Cleaning Tips: టాయిలెట్ బేషన్ కంటే, సెల్ ఫోన్ మీదే ఎక్కువ ప్రమాదకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇప్పటికే చాలా పరిశోధనలు ఈ విషయాన్నివెల్లడించాయి. అయితే, ఈ ప్రమాదకర సూక్ష్మ క్రిముల నుంచి కాపాడుకునేందుకు ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఫోన్ క్లీన్ చేయాలంటున్నారు నిపుణులు. అంతేకాదు, సెల్ ఫోన్ క్లీనింగ్ కోసం కచ్చితంగా మ్యానువల్ ను పాటించాలంటున్నారు. సాధారణంగా చాలామంది జస్ట్ క్లాత్‌తో తుడిస్తే చాలు.. క్లీన్ అయిపోతుందని అనుకుంటారు. కానీ అక్కడే తప్పు చేస్తున్నారు. ఆ విధానం అస్సలు మంచిది కాదు. ఫోన్ క్లినింగ్ అంటే.. చాలా శ్రద్ధగా చేయాల్సిన పని.


ఇంతకీ సెల్ ఫోన్ క్లీనింగ్ ఎలా చేయాలంటే?


1. వైప్స్, ఆల్కహాల్ బేస్డ్ సొల్యూషన్


మనం బయటకు వెళ్లినప్పుడు అనేక వస్తువులను పట్టుకుంటాం. వాటిని ఇతరులు కూడా పట్టుకుంటారు. దీంతో అందరి చేతులపై ఉండే చెడు బ్యాక్టీరియా అంతా వాటిపైనే ఉంటుంది. వాటిని ముట్టుకున్న తర్వాత మళ్లీ మన ఫోన్‌ను తాకుతాం. మీకు చేయ్యి కడిగే అలవాటు ఉంటే మంచిదే. కానీ, దానివల్ల మీ చెయ్యి క్లిన్ అవుతుంది కానీ.. ఫోన్ కాదు. మళ్లీ అదే చేతితో ఫోన్ ముట్టుకుంటే ఆ క్రిములు మీ చేతికి అంటుకుంటాయి. కాబట్టి.. మీరు బయట నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత తప్పకుండా మొబైల్ ఫోన్‌ను కూడా క్లీన్ చేయాలి. దాన్ని ఆల్కహాలిక్ ద్రావణంతో శుభ్రం చేయాలి. అయితే, స్ట్రెయిట్ ఆల్కహాల్ కాకుండా 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ వైప్‌లను ఉపయోగించడం మంచిది. ఫోన్‌ సోప్ లాంటి UV లైట్ ఉపయోగించడం కూడా మంచిదే. ఈ UV లైట్ 99.99% జెర్మ్స్‌ ను చంపుతుందని తయారీ కంపెనీ వెల్లడించింది.  


2. మైక్రోఫైబర్ క్లాత్‌ ఉపయోగించండి


మన శరీరం నుంచి ఆయిల్స్ ఉత్పత్తి అవుతాయి. దీంతో ఫోన్ స్క్రీన్ మీద వేలిముద్రలు పడుతాయి. అందుకే ఫోన్ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి సురక్షితమైన మైక్రోఫైబర్ క్లాత్ ను ఉపయోగించాలి. అయితే, మైక్రోఫైబర్ క్లాత్‌ను తడిపేందుకు డిస్టిల్ వాటర్ ఉపయోగించడం మంచిది. అంతేకాదు, మైక్రోఫైబర్ స్క్రీన్ క్లీనర్ స్టిక్కర్‌ను కూడా ఉపయోగించవచ్చు. కొద్ది రోజుల తర్వాత తొలగించుకోవచ్చు.   


ఫోన్‌ క్లీనింగ్ కోసం శామ్ సంగ్ టిప్స్   


1. టేప్ ట్రిక్‌ తో దుమ్మును తొలగించండి   


ఫోన్‌లోని చిన్న పోర్ట్‌ లతో పాటు స్క్రీన్ బాడీని కలిపే ప్రాంతాల్లో దుమ్ము ధూళి ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని తొలగించేందుకు బెస్ట్ టిప్ స్కాచ్ టేప్. ఈ టేప్ కు ఉన్న గమ్ ఫోన్‌లో చిక్కుకున్న మెత్తని దుమ్ము బయటకు తీస్తుంది.


2. మేకప్ రిమూవర్ తో జాగ్రత్త


మహిళలు ఉపయోగించే మేకప్ రిమూవర్ వల్ల కూడా ఫోన్ స్క్రీన్‌ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే, ఎలాంటి ప్రమాదం లేని మేకప్ రిమూవర్స్ ను ఉపయోగించాలి. హూష్  లాంటి మేకప్ రిమూవర్స్ సెల్ ఫోన్ స్క్రీన్‌లకు ఎలాంటి హాని కలిగించవు. అంతేకాదు, ఫోన్‌‌ను శుభ్రం చేయడానికి తడిగా ఉన్న మైక్రోఫైబర్ క్లాత్ ను కూడా ఉపయోగించవచ్చు.  


వాటర్‌ ప్రూఫ్ ఫోన్‌లను ఎలా శుభ్రం చేయాలి?


IP67, అంతకంటే ఎక్కువ రేటింగ్ కలిగిన వాటర్-రెసిస్టెంట్ ఫోన్లను నీటితో శుభ్రం చేసుకోవచ్చు. iPhone 15 Pro వంటి ఈ ఫోన్‌లు 6 మీటర్ల నీటిలో 30 నిమిషాల వరకు నీటిలో మునిగిపోయినా తట్టుకుంటాయి. అయినా, మీ ఫోన్‌ను శుభ్రం చేయడానికి తడిగా ఉన్న క్లాత్‌ను ఉపయోగించడం మంచింది.  


ఫోన్‌ను వీటితో అస్సలు క్లీన్ చేయకండి  


ఫోన్‌ను శుభ్రం చేయడానికి కొన్ని ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనే ఉపయోగించకూడదు. అవేంటంటే..


1. విండో క్లీనర్


అద్దాలు, కిటికీలను విండో క్లీనర్‌తో శుభ్రం చేస్తారు. దానితో సెల్ ఫోన్‌ను క్లీన్ చేయకూడదు. ఒకవేళ చేస్తే స్క్రీన్‌ మీద కోటింగ్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఫోన్ చెడిపోయే అవకాశం ఉంటుంది.   


2. కిచెన్ క్లీనర్లు


క్లీనింగ్ ఏజెంట్ల ద్వారా స్క్రీన్ స్క్రాచ్ రెసిస్టెంట్ లక్షణాలు తగ్గవు. కానీ, ప్రొటెక్టింగ్ లేయర్ ను తొలగించే అవకాశం ఉంటుంది. అందుకే, ఆపిల్ ఐఫోన్‌ను కిచెన్ క్లీనర్లతో శుభ్రం చేయకూడదని సూచించింది.  


3. పేపర్ టవల్


డెస్కులను శుభ్రం చేసేందుకు ఉపయోగించే పేపర్ టవల్స్ ను ఫోన్ క్లీన్ చేయడానికి అస్సలు వాడకూడదు. పేపర్ ముక్కలు ఫోన్ లో చిక్కుకుని కొత్త సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంది. స్క్రీన్‌ మీద గీతలు పడే అవకాశం ఉంటుంది.  


4. రబ్బింగ్ ఆల్కహాల్


కొత్త ఫోన్‌లు ప్రొటెక్టింగ్ కోటింగ్ ను కలిగి ఉంటాయి. రబ్బింగ్ ఆల్కహాల్ ఉపయోగించి ఫోన్ ను శుభ్రం చేయడం వల్ల ఆ కోటింగ్ త్వరగా వెళ్లిపోతుంది. ఫోన్ మీద త్వరగా గీతలు పడుతాయి.  


5. కంప్రెస్డ్ ఎయిర్


ఫోన్ చాలా సున్నితంగా ఉంటుంది. దాని పోర్టల్‌లలోకి ప్రెషర్ తో కూడిన గాలి వెళ్లడం వల్ల మైక్ వీక్ అవుతుంది. అందుకే  ఆపిల్ లాంటి టెక్ కంపెనీలు కంప్రెస్డ్ ఎయిర్‌ను ఉపయోగించవద్దని హెచ్చరిస్తున్నాయి. సబ్బు, వెనిగర్ లాంటి వాటితోనూ సెల్ ఫోన్లను క్లీన్ చేస్తే చెడిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Read Also: హాట్ సమ్మర్​లో మట్టి కుండలోని నీరు తాగుతున్నారా? అయితే మీరు వీటి​ గురించి తెలుసుకోవాల్సిందే