Top 10 Headlines Today: 

1. బుడమేరుకు మళ్లీ వరద అంటూ వదంతులు: 

బుడమేరుకు మళ్లీ వరద అంటూ వచ్చిన వదంతులతో విజయవాడ వాసులు మరోసారి భయాందోళనలకు గురయ్యారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందని.. భారీగా వరద వస్తుందన్న పుకార్లు వచ్చాయి. ఈ వదంతులపై స్పందించిన మంత్రి నారాయణ... ఈ పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని... విజయవాడ పూర్తి సురక్షితంగా ఉందన్నారు. బుడమేరుపై పుకార్లను వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

2. గణేష్‌ మండపం వద్ద జగన్‌ పాట.. కేసు నమోదు

శ్రీకాకుళం జిల్లాలోని బి.కొత్తకోటలో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు వేడుకల్లో మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కీర్తిస్తూ మైకులో పాటలు పెట్టడం వివాదాస్పదమైంది. ఆ పాటలు పెట్టడం ద్వారా ప్రత్యర్థి వర్గం వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులు శనివారం కేసు పెట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

3. నటి కేసులో ఆ ముగ్గురు ఐపీఎస్‌లపైనా వేటు..?

ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడడంతో మిగిలిన అధికారులు భయంతో వణికిపోతున్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్‌లు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీలపై కూడా చర్యలకు రంగం సిద్ధమైంది. నేడో, రేపో వీరి ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నటి వేధింపుల్లో వీరు కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

4. హైదరాబాద్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్లు

గుండె సంబంధిత సమస్యలు ఉన్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ శుభవార్త చెప్పింది. వారం రోజుల పాటు గుండె సంబంధిత సమస్యలు ఉన్న పిల్లలకు ఉచితంగా సర్జరీలు చేయనున్నారు. యూకేకు చెందిన వైద్యుల బృందం వచ్చేవారం హైదరాబాద్ రానుంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీవరకు నిమ్స్ హాస్పిటల్‌లో పిల్లలకు గుండెకు సంబంధించిన సర్జరీలు ఉచితంగా చేయనున్నారు. రమణ దన్నపునేని ఆధ్వర్యంలో యూకే డాక్టర్స్ టీమ్ ఈ ఉచిత వైద్య సేవల్ని అందించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

5. వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలు షురూ అయ్యాయి. ఈ నెల 7న వినాయక చవితి రోజున మండపాల్లో కొలువు దీరిన గణేష్ పూజలు అందుకుంటున్నాడు. మూడో రోజు నుంచి నగరంలో నిమజ్జనాలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఈ నెల 17న ఖైరతాబాద్ గణేశుడితో సహా మహా నిమజ్జనం జరగనుండగా.. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

6. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఫ్యాన్‌కు NTR ఫోన్

క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి యంగ్ టైగర్ NTR వీడియో కాల్‌ చేసి ధైర్యం చెప్పారు. ఏపీకి చెందిన కౌశిక్(19)కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే దేవర మూవీ రిలీజయ్యే వరకైనా తన బిడ్డను బతికించాలంటూ తల్లిదండ్రులు కోరగా, ఆ వీడియో తారక్ దృష్టికి చేరింది. దీంతో NTR స్వయంగా కౌశిక్‌కు వీడియో కాల్ చేశారు. ఏ మాత్రం భయపడొద్దని, నవ్వుతుంటే బాగున్నావంటూ అతడిలో ధైర్యం నింపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

7. ప్రేమ వ్యవహారంలో యువకుడిపై కత్తితో దాడి

ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. ఎంబీయూ వర్శిటీ విద్యార్థి లోకేశ్ ఓ యువతితో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తుండగా.. కార్తీక్ అనే మరో యువకుడు లోకేశ్‌పై కత్తితో దాడికి పాల్పడగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత దాడి చేసిన యువకుడు, యువతి పరారయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

8. కర్నూలులో చంటి సినిమా తరహా ఘటన

కర్నూలు జిల్లాలో చంటి సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. పెడ్డకడబూరు మండలం కలుకుంటలో 6 నెలల క్రితం దళిత మహిళ గోవిందమ్మ కుమారుడు.. బీసీ యువతి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గ్రామాన్ని విడిచి వెళ్లారు. తాజాగా గోవిందమ్మ ఊర్లోకి రాగా ఆమెను యువతి బంధువులు చెట్టుకు కట్టేసి మతిస్థిమితం లేని ఓ వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు యత్నించారు. ఆ లోపు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను రక్షించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

9. సింగరేణిలో ఉద్యోగాలు

తెలంగాణలోని కొత్తగూడెం-సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. అర్హులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్య్వూ, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. నెలకు రూ.1,25,000 జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

10. పాక్‌పై భారత్‌ ఘన విజయం

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ హవా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌కు చెరిన భారత్ నామమాత్రపు మ్యాచ్‌లో పాక్‌పై 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ కొట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..