Singareni Collieries Company Recruitment: తెలంగాణలోని కొత్తగూడెం-సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్య్వూ, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,25,000 జీతంగా చెల్లిస్తారు.
వివరాలు..
* మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్
ఖాళీల సంఖ్య: 21 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
1) అనస్తెటిస్ట్: 02 పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ/డీఎన్‌బీ/ సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.
2) చెస్ట్ ఫిజీషియన్: 01 పోస్టు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ.
3) ఈఎన్‌టీ సర్జన్: 02 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ.
4) జనరల్ సర్జన్: 02 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/డీఎన్‌బీ.
5) హెల్త్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ.
6) ఆప్తాల్మాలజిస్ట్: 02 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ.
7) ఆర్థో సర్జన్: 03 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/డీఎన్‌బీ.
8) పీడియాట్రీషియన్: 02 పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ/డీఎన్‌బీ/ సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.
9) ఫిజీషియన్: 02 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/డీఎన్‌బీ.
10) రేడియాలజిస్ట్: 03 పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ/డీఎన్‌బీ/ సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.
వయోపరిమితి: 64 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్య్వూ, పని అనుభవం తదితరాల ఆధారంగా.
జీతం: నెలకు రూ.1,25,000.
ముఖ్యమైన తేదీలు..
⫸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.09.2024.
⫸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.09.2024. 5.00 PM
⫸ ఇంటర్వ్యూ తేదీ: 21.09.2024. (at 9.30 AM)
వేదిక: O/o. Director (PA&W)
The S.C.C.L., Head Office, Kothagudem,
Bhadradri Kothagudem District, Telangana.
ఇంటర్వ్యూకు వచ్చేవారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు..
► పదోతరగతి ఒరిజినల్ సర్టిఫికేట్లు
► ఎంబీబీఎస్ ఒరిజినల్ సర్టిఫికేట్లు
► పీజీ డిగ్రీ/డీఎన్‌బీ/డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికేట్లు
► స్టేట్ మెడికల్ కౌన్సిల్/మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
► క్యాస్ట్ సర్టిఫికేట్ (6 నెలల ముందు తీసినది)
► 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
► ఈడబ్ల్యూఎస్- ఇన్‌కమ్ సర్టిఫికేట్
► ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులైతే సర్వీస్ సర్టిఫికేట్
► ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్
► ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్ కాపీ
► అన్ని సర్టిఫికేట్ల 2 జతల జిరాక్స్ కాపీలు
► 10 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
ALSO READ: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
దేశంలోని సైనిక స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 'ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ' దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పీఆర్‌టీ పోస్టులను భర్తీచేయనున్నారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. తెలంగాణ సికింద్రాబాద్ (ఆర్‌కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ సైనిక పాఠశాలలు ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..