Top 10 Headlines Today: 


లైట్‌ తీసుకున్నారా... ప్రమాదం కాదా?


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకు రావడం లేదు. రెండు జిల్లాల్లో పర్యటించి బహిరంగసభల్లో ప్రసంగించారు. ఆయన కాంగ్రెస్ సంగతి చూద్దామన్నారు కానీ బీజేపీని పల్తెత్తు మాట అనలేదు. దీంతో బీజేపీ నేతలు ఫీలవుతున్నారు. కేసీఆర్ కుట్ర చేస్తున్నారని గొణుక్కుంటున్నారు. కానీ పైకి ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే.. బీజేపీని కేసీఆర్ ప్రత్యర్థిగా భావించడం లేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతోంది. అలా అయితే ప్రత్యామ్నాయంగా గుర్తించి ఎలా ఓట్లు వేస్తారని బీజేపీ నేతల ఆందోళన. అసలు కేసీఆర్ విమర్శించకపోవడానికి కారణం ఏమిటి ? బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బకొడుతున్నారా లేక ఢిల్లీ బీజేపీతో సఖ్యత కోసం ఇలా చేస్తున్నారా ? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అరెస్టు- విడుదల


మాజీ మంత్రి వివేకానందరెడ్డి  హత్య కేసులో .. ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఇప్పటి వరకూ నిందితుడిగా ఎక్కడా చెప్పలేదు. తొలిసారిగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చింది.  హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరివివేతలో కీలకంగా వ్యవహరించారని సీబీఐ కౌంటర్ లో తెలిపింది. భాస్కర్ రెడ్డికి  బెయిల్ ఇస్తే.. దర్యాప్తు, సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తారని సీబీఐ కౌంటర్ లో తెలిపింది. భాస్కర్ రెడ్డి పులివెందులలో చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని ... ఆయనకు బెయిల్ ఇవ్వవొద్దని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గుడివాడ టూర్ వాయిదా


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గుడివాడ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. గుడివాడలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు సీఎం క్యాంపు ఆఫీసు అధికారులు గురువారం (జూన్ 8) ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, గుడివాడ పర్యటన వాయిదా వేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అడ్వాన్స్డ్‌ కార్డులు


ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తారు. తీరా గెలిచిన తర్వాత రకరకాల అర్హతలు ఖరారు చేసి .. అర్హులైన వారికి మాత్రమే ఇస్తామని చెబుతూంటారు. ఈ కారణంగా ఉచిత హామీల విషయంలో ప్రజలు పార్టీలను నమ్మడం కష్టం. అందుకే తెలుగుదేశం పార్టీ వినూత్నమైన మార్గాన్ని అవలంభిస్తోంది. లబ్దిదారులను ముందుగానే  గుర్తించి కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఇలా చేయడం ద్వారా టీడీపీ ప్రభుత్వం వస్తే తమకు పథకాలు రావనే భయం ఉంటే పోతుందని..  అదే సమయంలో.. ఆ కార్డు పథకం గ్యారంటీగా వస్తుందనే భరోసా వస్తుంది.. ఓట్ల వర్షం కురుస్తుందని టీడీపీ నేతలు గట్టిగా ఆశలు పెట్టుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సింపుల్ వెడ్డింగ్


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం గురువారం (జూన్ 8) జరిగింది. బెంగళూరులోని ఓ ఇంట్లో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. పరకాల వాంగ్మయి వివాహం నిరాడంబరంగా జరిగిందని, ఇందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని చెబుతున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వర్షాలు పడే ఛాన్స్


నిన్న ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (జూన్ 8) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య మరియు పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలుగు రాష్ట్రాలకు వైద్యకాలేజీలు


దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 50 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఏపీకి 5, తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు దక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 అకడమిక్ నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో ఈ కాలేజీలు మొదలు పెడతామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వివాదాల శివరాం


కోడెల శివరాం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇస్తామని చెప్పి ఆయన తీసుకున్న డబ్బులు ఇప్పటి వరకు చెల్లించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కోడెల తమ డబ్బు చెల్లించకపోతే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాతే తన తండ్రి కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తన మన అన్న తేడా‌ లేకుండా  తండ్రి అధికారాలను అడ్డు పెట్టుకొని టీడీపీ నాయకులను బెదిరించి పెద్ద ఎత్తున శివరాం డబ్బులు వసూలు చేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివరాం బాధితులు అందరు ఏకమై.. కొడుకు అవీనీతి కారణంగా పరువు పోయి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఫాలో ఆన్ గండం 


ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లండన్‌లో జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమైంది. ఇప్పుడు టీమ్ఇండియా ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. ఫాలోఆన్ కాపాడుకోవాలంటే టీమిండియా ఇంకా 269 పరుగులు చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ ప్రత్యేకంగా జట్టును ఆదుకోలేక ఆసిస్ బౌలర్లకు దాసోహమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


'విమానం' రివ్యూ 


ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా 'విమానం' (Vimanam 2023 movie). ఇందులో సముద్రఖని వికలాంగునిగా, ఆయన కుమారుడిగా మాస్టర్ ధ్రువన్ నటించారు. అనసూయ వేశ్య పాత్ర పోషించారు. కొంత విరామం తర్వాత  మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  రాహుల్ రామకృష్ణ, మొట్ట రాజేంద్రన్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉంది (Vimanam Movie Review)? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి