WTC 2023 Final IND vs AUS Kennington Oval, London: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లండన్‌లో జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. 
తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమైంది. ఇప్పుడు టీమ్ఇండియా ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. ఫాలోఆన్ కాపాడుకోవాలంటే టీమిండియా ఇంకా 269 పరుగులు చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ ప్రత్యేకంగా జట్టును ఆదుకోలేక ఆసిస్ బౌలర్లకు దాసోహమయ్యారు. 


టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులు మాత్రమే చేసింది. 5 వికెట్లు కూడా కోల్పోయింది. ఈ కారణంగా ఫాలోఆన్ గండం పొంచి ఉంది. ఫాలోఆన్ నుంచి భారత్ బయటపడాలంటే మాత్రం 269 పరుగులు చేయాలి. కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరుగలకు మరో 118 పరుగులు జోడించాలి. ప్రస్తుతం క్రీజ్‌లో అజింక్య రహానె, శ్రీకర్ భరత్ ఉన్నారు. వారిపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది. 


చాలా కాలం తర్వాత రహానే తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. ఇప్పుడు రహానే, భరత్ మాత్రమే ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేయగలరు. టీమ్ ఇండియా తరఫున 7 టెస్టు ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు భరత్.. ఈ సమయంలో ఆయన ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు తమను తాము నిరూపించుకునే వారికి వచ్చింది. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగనున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా కంటే 318 పరుగులు వెనుకబడి ఉంది.


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ తర్వాత భారత్ తరఫున రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ దిగారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 26 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అతడిని కమిన్స్ పెవిలియన్‌కు పంపించాడు. శుభ్మన్ 15 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా కూడా పెవిలియన్ చేరాడు. వెటరన్ బ్యాటర్‌ పుజారా 25 బంతుల్లో 14 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం14 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా చాలాసేపు కష్టపడ్డాడు. 51 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేశాడు. ఈ రకంగా టీమ్ఇండియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే వరకు అజింక్య రహానే 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీకర్ భరత్ 5 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.