Top 10 News : 

 

ఆటమ్ బాంబు పేలుతోందంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో  త్వరలోనే ఆటంబాంబ్ పేలుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్లకు నాటుబాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటమ్‌బాంబు పేలబోతోందంటూ హెచ్చరించారు. జనం సొమ్మును అక్రమమార్గంలో విదేశాలకు పంపారని... ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదని మంత్రి స్పష్టం చేశారు. రూ.55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తామన్నారు. తప్పు చేయని వాళ్లు ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు.' అని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు


ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితం అయిన డే కేర్ సెంటర్‌లను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి కూడా తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం. క్రెష్‌ పేరుతో అంగన్‌వాడీ తరహాలోనే ఈ పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అంగన్‌వాడీ కేంద్రాలు మాదిరిగానే ఇక్కడ కూడా సిబ్బందిని ప్రభుత్వం నియమించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


తెలంగాణలో కాంగ్రెస్  కొత్త ఏజెండా
 తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ ని బలపర్చుకునే  వ్యూహాత్మకంగా  అడుగులేస్తోంది. ఉమ్మడి జిల్లాను యూనిట్‌గా  తీసుకుని ఒక్కో అజెండాతో రంగంలోకి దిగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  ఈ  వ్యూహం సక్సెస్ అయితే ఇతర రాజకీయ పరిణామాలతో సంబంధం  లేకుండా .. కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: జగన్

ఏపీలో ప్రస్తుతం అన్యాయమైన పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కడా ఇలాంటివి చూసి ఉండరని మాజీ సీఎం జగన్ అన్నారు. 'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ప్రశ్నించే స్వరం ఉండకూదని, అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేశారు' అని జగన్ అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


అసెంబ్లీ సమావేశాలకు, బ్యాలెట్ ఎన్నికలకు   వైసీపీ దూరం ,


అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండా ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు.  అలాగే ఏపీలో జరగుతున్న రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది.ఎన్నికలు ఏకపక్షం జరుపుకుంటారనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్ని నాని ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



మదమెక్కిన వైసీపీ నేతలను వదలను: చంద్రబాబు

సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాకు అడ్డూ అదుపులేకుండా పోయిందని.. ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా తన భార్యపైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్న సీఎం.. మదమెక్కి, కొవ్వు పట్టిన వైసీపీ నేతలను వదిలే ప్రసక్తే లేదన్నారు. తనతో ఆడుకోవాలని చూస్తే ఎవరినీ వదిలి పెట్టనని స్పష్టం చేశారు. నేరస్థులు రాజకీయ నేతల ముసుగులో ఉన్నారన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

పవన్ తో హోంమంత్రి అనిత భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత  భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై ఇరువురూ చర్చించారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటోన్న చర్యల గురించి పవన్‌కు అనిత వివరించారు. తన కూతురు కన్నీళ్లు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ సూచించినట్లు అనిత చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

వాళ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా వదలబోం: హోంమంత్రి

 ఏపీ ప్రభుత్వంపై, ఆడబిడ్డలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తలు.. సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని హెచ్చరించారు. విమర్శలను ఎదుర్కొంటామని.. కానీ అసభ్యంగా పోస్టులు పెట్టే వారిని మాత్రం వదిలిపెట్టమని స్పష్టంచేశారు. క్రిమినల్స్‌ను జగన్ వెనకేసుకు రావడమేంటని నిలదీశారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

మద్యం తాగి వాహనాలు నడిపితే ఇక ఆస్పత్రి శుభ్రం చేయాల్సిందే

మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. సాధారణంగా విధించే శిక్షలకు భిన్నంగా మంచిర్యాల న్యాయస్థానం.. డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు విభిన్నమైన శిక్ష విధించింది. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 24 మందిని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని శుభ్రం చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

మంచు కొండలుగా మారుతున్న సౌదీ ఎడారులు

సౌదీ అరేబియా ఎడారుల్లో వర్షం, మంచు జాడ ఎప్పుడూ కనపడదు. అలాంటిది ఈ సారి మాత్రం మంచు కురుస్తోంది. అది కూడా అలా ఇలా కాదు. మన కశ్మీర్‌లో మంచు కురిసి రోడ్లు ఎలా బ్లాక్ అవుతాయో అంత భారీగా కురుస్తోంది. ఈ దృశ్యాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎడారుల్లో ఇలా వరదలు రావడం, మంచు తుపాన్లు రావడం వాతావరణ మార్పులకు సంకేతమని ఇది భూమి మనుగడకు ప్రమాదకర సంకేతాలని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..