Satyabhama Serial Today Episode సత్యకి కరెంట్ షాక్ కొట్టాలని భైరవి మోటర్ స్విచ్ దగ్గర ఏర్పాటు చేస్తుంది. సత్య వెళ్లి స్విచ్ వేసినా కరెంట్ లేకపోవడంతో షాక్ కొట్టదు. సత్యకి ఏం కాకపోవడంతో భైరవి షాక్ అయిపోయి తనని మోటర్ స్విచ్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక క్రిష్ తన గదిలో కరెంట్ లేకుండా కిచెన్‌లో ఉండటం గమనించి ఏమైందా అని ఫ్యూజ్ సెట్ చేస్తాడు. అది తెలియని భైరవి తానే స్విచ్ వేస్తుంది.


భైరవికి షాక్ కొడుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. దాంతో జయమ్మ భైరవిని కొట్టమని చెప్తే సత్య కర్రతో కొడుతుంది. భైరవి అలాగే ఉండిపోతుంది. భైరవి ముఖం చూస్తే చాలా కామెడీగా ఉంటుంది. 


సత్య: నాకు ఏం కాలేదు మీకు ఎందుకు అత్తయ్య షాక్ కొట్టింది. 
పంకజం: అమ్మ మీరు వేలు పెట్టకుండా ఉండాల్సింది అమ్మ
రేణుక: షాక్ గట్టిగానే తగిలినట్లుంది డాక్టర్ పిలిస్తే బెటర్.
సత్య: సత్య ఏమైంది ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా.
జయమ్మ: పోయే ముందు ఆఖరి కోరిక అడిగినట్లు ఏంటే ఆ అడగటం. 
సత్య: వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు. మళ్లీ ఓసారి షాక్ కొట్టేలా చేయాలేమో.
క్రిష్: ఏం జరుగుతుంది ఇక్కడ. నువ్వేంటి అమ్మ రోజుకో గెటప్ వేస్తున్నావ్. కోకా పేట ఆంటీ గెటప్ అయిపోయింది ఇప్పుడు ఇదేంటి. దాని కంటే ఈ గెటప్‌నే బాగుంది ఉండు ఫోటో తీసి నాన్నకి పెడతా.
సత్య: అత్తయ్యకి షాక్ కొట్టింది క్రిష్ గమ్మత్తు ఏంటో తెలుసు ఒక్క నిమిషం ముందు నేను స్విచ్ వేసినా నాకు ఏం కాలేదు అత్తయ్య పని మాత్రం అయిపోయింది.
క్రిష్: అరే ఈ లైన్‌ది కరెంట్ పోయింది అప్పుడు లేదు ఫ్యూజ్ మార్చిన తర్వాత కరెంట్ వచ్చింది.  


పంకజం, క్రిష్‌ భైరవిని లోపలకి తీసుకెళ్తారు. మరోవైపు విశ్వనాథం దగ్గరకు విశాలాక్షి వచ్చి ఈ మధ్య హర్ష నాతో ఎక్కువ మాట్లాడటం లేదని చెప్తుంది. హర్ష ఎందుకు అలా ఉన్నాడో అడుగు అని అంటుంది. ఇంతలో హర్షకి పోస్ట్ వస్తుంది. హర్ష వెళ్తాడు. పోస్ట్ తీసుకొని ఇంటికి వస్తాడు. అందరూ హాల్లోకి చేరి ఏంటని అడుగుతారు. మైత్రిని హర్ష పిలిచి నీ వీసా వచ్చేసిందని చెప్తాడు. అందరూ సంతోష పడతారు. మైత్రి ఇక సూట్ కేస్ సర్దుకోవడమే ఆలస్యం అని అంటాడు. డబ్బు కూడా రెడీ చేసేశానని హర్ష చెప్తాడు. మీ వల్లే నాకు మంచి జరిగిందని కొత్త జీవితం దొరికిందని మైత్రి హర్షతో పాటు హర్ష తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్తుంది. సంతోషంగా ఉంది కానీ మీ అందర్ని  వదిలి వెళ్లాలి అంటుంటే బాధగా ఉందని అంటుంది మైత్రి. దానికి నందిని నేను నా పుట్టింటిని వదిలి వచ్చాను కదా అలాగే నీకు అలవాటు అయిపోతుందని అంటుంది.


నాకు వెళ్లాలి అని లేదని మైత్రి అంటుంది. వెళ్లాలో లేదో మరోసారి ఆలోచించుకో అని శాంతమ్మ అంటే చదువు కంటే ఇంకేం ముఖ్యం కాదు మైత్రి వెళ్తుందని హర్ష అంటాడు. ఇక భైరవిని డాక్టర్ చూస్తుంది. రెస్ట్ తీసుకోమని డాక్టర్ అంటుంది. రోజంతా జ్యూస్‌లే తాగాలని అంటుంది. నా వల్ల కాదు అని భైరవి అంటే అందరూ తినకపోతే నువ్వే విలవిల్లాడిపోతావని అంటారు. జయమ్మ మాత్రం భైరవిని ఏడిపించడానికి అక్కడికే తన కోసం బిర్యాని తీసుకురమ్మని చెప్తుంది. కావాలనే జయమ్మని నోరూరేలా చేస్తూ జయమ్మ లొట్టలేసుకొని బిర్యాని తింటుంది. భైరవి ముఖం మాడ్చుకుంటుంది. సత్య కూడా కావాలనే అత్తయ్య కొద్దిగా తీసుకురానా అని వెటకారంగా భైరవి వీక్‌ పాయింట్‌తో ఆడుకొని నవ్వుకుంటారు. 



మరోవైపు రాత్రి విశ్వనాథంతో మాట్లాడమని విశ్వనాథంలో విశాలాక్షి చెప్తుంది. ఇంతలో హర్ష వస్తాడు. అమ్మ నగలు ఇవ్వలేదు మరి మైత్రి ప్రయాణానికి డబ్బు ఎక్కడిది అని అడుగుతారు. దానికి హర్ష డబ్బు ఎలా సెట్ అయిందో చెప్పే ధైర్యం లేదు అని చెప్పలేదని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'త్రినయని' సీరియల్: విశాల్ వెనుక త్రినేత్రి పరుగులు.. ఒకేలాంటి చీరల్లో నయని, త్రినేత్రి.. బలి కాబోతుంది ఎవరో?