Jagadhatri  Serial Today Episode:   మధుకర్ రూంలో దొరికిన ఆధారాల ప్రకారం బ్యాంకు వెళ్తారు ధాత్రి, కేదార్‌. లోపలికి వెళ్లి మేనేజర్‌ ను ప్రొఫెసర్‌ మధుకర్‌ గురించి ఆరా తీస్తారు. ఆయన లాకర్‌ గురించి అడిగి ఆ లాకర్‌ ను ఓపెన్‌ చేయాలని అడుగుతారు. మేనేజర్‌ మొదట ఓపెన్‌ చేయనని పోలీసులకు చెప్తానని అనడంతో మేము కూడా పోలీసులమే అని ధాత్రి, కేదార్‌ చెప్పగానే మేనేజర్‌ సరేనని లాకర్‌ లో ఏముందో తీసుకొస్తానని వెళ్తాడు. మరోవైపు యువరాజ్‌, కౌషికి, కమలాకర్‌ కూడా అదే బ్యాంకుకు వస్తారు.


కేదార్‌: ఆ లాకర్‌ లో మా అమ్మకు సంబంధించిన ఆధారం ఏమైనా ఉంటుందా? ధాత్రి.


ధాత్రి: చూద్దాం.. సూరి బాబాయ్ చెప్పిన దాన్ని ప్రకారం ఏదైనా ఉండొచ్చు


మేనేజర్‌ లాకర్‌ లో ఉన్న అమ్మవారి విగ్రహం, కొన్ని డాక్యుమెంట్స్‌ తీసుకుని వస్తాడు. ఆ విగ్రహం చూడగానే ధాత్రి, కేదార్‌ ఆశ్చర్యపోతారు. ఇంతలో మేనేజర్‌ రూంలోకి కౌషికి, యువరాజ్‌, కమలాకర్‌ వస్తారు.


కౌషికి: మా ఇంటికి వచ్చి మా నాన్నగారి డైరీలో పేపర్‌ చించుకోవడమే తప్పు అనుకుంటే.. నేరుగా మా నాన్నగారి లాకరే ఓపెన్‌ చేయించారా..?


కమలాకర్‌: మేనేజర్‌ గారు మీరు ఇలా ఓపెన్‌ చేయడం తప్పు కాదు. ఎవరు పడితే వాళ్లు వస్తే ఓపెన్‌ చేస్తారా..?


మేనేజర్‌: ఏదో కేసు విషయంలో ఎంక్వైరీ అన్నారు సార్‌ అందుకే ఓపెన్‌ చేశాను. అంతేకానీ విగ్రహాన్ని వాళ్లకు ఇవ్వలేదు కదా.


ధాత్రి: మేనేజర్‌ గారు ఈ విగ్రహాన్ని ఎంక్వైరీ కొరకు తీసుకెళ్లాలి.


మేనేజర్: సారీ అండి ఈ విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వడానికి లేదు.


కౌషికి: నేను మధుకర్‌ గారి కూతురుని మేనేజర్‌ గారు. ఈ విగ్రహం నాకు ఇవ్వండి.


మేనేజర్‌: మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పాను కదా..?


కమలాకర్‌: ఎందుకు వీలు కాదండి.


మేనేజర్‌: మధుకర్‌ గారి వస్తువులు నామినీగా సుహాసిని అనే పేరు ఉంది.


   అని మేనేజర్‌ చెప్పగానే కేదార్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. ఈ విగ్రహం సుహాసిని గారికి కానీ తన వారసులకు మాత్రమే చెందుతుంది అని మేనేజర్‌ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. సుహాసిని గారి వారసుడు అంటే కేదార్‌ కదా..? కేదార్‌ కు అప్పగిస్తే సరిపోతుంది. ఈ జేడీకి మాత్రం అప్పగించకూడదు. అని మనసులో అనుకుని సుహాసిని గారి వారసుణ్ని నేను తీసుకొస్తాను అంటుంది కౌషికి. పోలీసుల పర్మిషన్‌ తో తీసుకెళ్లండి కౌషికి గారు అని మేనేజర్‌ చెప్పగానే..ధాత్రి పర్వాలేదు అని చెప్తుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కౌషికి వాళ్ల కన్నా ముందు కేదార్‌, ధాత్రి ఇంటికి వస్తారు.  విగ్రహం తీసుకుని ఇంటికి వచ్చిన కౌషికి జగధాత్రి వాళ్లను ఒకసారి కలవాలి అంటుంది.  


యువరాజ్‌: అక్కా ఈ విగ్రహం వాళ్లకు ఇచ్చే ముందు అసలు ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం అక్క.


కౌషికి: వద్దు యువరాజ్‌.. ఇది పోలీసులు ఇన్వాల్వ్‌ అయిన విషయం కాబట్టి మనం తొందరపడకూడదు. పోలీసులకు తెలియకుండా మనం ఓపెన్‌ చేస్తే ఏదైనా సమస్య రావొచ్చు.


వైజయంతి: మనకు చెందిన విగ్రహం మనం ఓపెన్‌ చేయకపోవడం ఏంటి అమ్మి..


కౌషికి: లేదు పిన్ని ఏదైనా సమస్య రావొచ్చు.. పదండి వెళ్లి వాళ్లకు ఇద్దాం


   అని అందరూ వెళ్లి జగధాత్రి వాళ్లకు విగ్రహం ఇస్తారు. ఇంత విలువైన విగ్రహం మా దగ్గర ఉంచడం ఏంటి అక్కా అని కేదార్‌ అడుగుతాడు. మాకు కొంచెం భయంగా ఉంది అక్కా అంటాడు. దీంతో భయపడవలసిన అవసరం లేదు. ఇది మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి కౌషికి విగ్రహం ఇచ్చి వెళ్లిపోతారు. ఆ విగ్రహం మీ దగ్గర ఉండటమే కరెక్టురా కేదార్‌. ఎందుకంటే అది దొంగిలించి ఆ దొంగతనం మీ మీద వేయడం బెటర్‌ అని మనసులో అనుకుంటాడు యువరాజ్‌.  ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!