Day Care Centers In Telangana : తెలంగాణలో వర్కింగ్ మదర్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం అమలు చేయానుంది. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితం అయిన డే కేర్ సెంటర్‌లను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి కూడా తీసుకురానుంది. క్రెష్‌ పేరుతో అంగన్‌వాడీ తరహాలోనే ఈ పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 


మహిళల ఆర్థిక పరిపుష్టికి చేయూత


కాలం మారుతున్న కొద్ది ఫ్యామిలీలో దంపతులు ఇద్దరూ పని చేయాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో ఇంట్లో ఉన్న పిల్లల సంరక్షణ సమస్యగా మారుతోంది. దీని వల్ల మహిళలు మానిసిక ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల కోసం ఉద్యోగానికి, పనికి వెళ్లడం మానేసిన వారు కూడా ఉన్నారు. దీని వల్ల ఆ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 



ప్రభుత్వం ఆధ్వర్యంలో పిల్లల లాలన 


సంతానం కారణంగా పిల్లలు ఎవరూ పని చేయడం, ఉద్యోగాలు మానేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ డే కేర్‌ సెంటర్‌లు ప్లాన్ చేస్తోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సెంటర్‌లో ఆరు నెలల నుంచి రెండున్నరేళ్ల లోపు పిల్లల లాలన చూసుకోనున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.  


అంగన్‌వాడీ తరహాలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ డే కేర్ సెంటర్‌లలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం, వారికి కావాల్సిన ఫుడ్ పెట్టడం, నిద్రపోనివ్వడం, ఆటలు ఆడిపించడం, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు మాదిరిగానే ఇక్కడ కూడా సిబ్బందిని ప్రభుత్వం నియమించనుంది. ఒక్కో సెంటర్‌లో ఇద్దరు సహాయకులు ఉంటారు. 


సిబ్బంది కూడా అమ్మే


అంగన్ వాడీ సెంటర్‌లో ఖాళీ ఉంటే అక్కడ లేదంటే వేరే ప్రాంతాల్లో ఈ డే కేర్‌ సెంటర్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక్కడి సిబ్బంది నియామకాలపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రెండున్నర ఏళ్ల లోపు పిల్లలు ఉన్న వ్యక్తులను ఇక్కడ నియమించాలని భావిస్తున్నారు. అలా అయితేనే వారికి పిల్లల గురించి పూర్తి అవగాహన ఉంటుందని ఓపికత చేస్తారని అంటున్నారు. అదే టైంలో వారికి ఉపాధి కూడా లభించనుంది.డే కేర్‌ సెంటర్‌లకు సంబంధించిన విధి విధానాలు, నియామక నోటిఫికేషన్ త్వరలోనే రానుంది.  


Also Read: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు