Telangana TET Fee: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పరీక్ష కోసం చెల్లించే ఫీజును భారీగా తగ్గించింది. గతంలో పేపర్‌ వన్ లేదా పేపర్‌ టూ ఏది రాసినా వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 750 రూపాయలకు  తగ్గించారు. అదే రెండూ కలిపి రాసిన వాళ్లు గతంలో రెండు వేలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని సగానికి తగ్గించారు. అంటే వెయ్యిరూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 


సగానికి తగ్గిన ఫీజు


టెట్‌ ఫీజు తగ్గిస్తే రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. ఈ మేరకు వెబ్‌సైట్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటికే చెల్లించిన వారు ఏం చేయాలి. లాంటి  పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రెండు రోజులక్రితం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో మొదటి రోజు దరఖాస్తు చేయడానికి ఇబ్బంది ఎదురైంది. దాన్ని సరి చేసిన తర్వాత ఒక రోజు ఆలస్యంగా గురువారం నుంచి సైట్ సక్రమంగా పని చేస్తోంది. 


వాళ్లకు ఫ్రీ


గతంలో ఈ ఫీజులు కేవలం 400 రూపాయలు మాత్రమే ఉండేది. దీన్ని రేవంత్ సర్కారు వెయ్యికి పెంచింది. అప్పట్లో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా దాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు. ఆ పరీక్షలో అర్హత సాధించలేని వాళ్లు భవిష్యత్‌లో వచ్చే నోటిఫికేషన్‌లో ఉచితంగా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. గత టెట్‌ 2.35 లక్షల మంది రాస్తే 1.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంకా ఉత్తీర్ణత సాధించని 1.26 లక్షల మంది ఈసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 


దరఖాస్తు ప్రక్రియ నెల 20 వరకు కొనసాగనుంది. 2025 జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను డిసెంబర్ 27 నుంచి 2025 జనవరి 20 వరకు పంపిణీ చేయనుంది. ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడించనుంది. 


టెట్‌ ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి అర్హులు 


డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా అందులో వచ్చిన మార్కులను కూడా డీఎస్సీలో మెరిట్‌గా తీసుకుంటారు. అందుకే ఏటా ఈ టెట్‌ను నిర్వహిస్తుంటారు. 150 మార్కులకు ఈ టెట్ పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2 ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఇలా అన్ని విభాగల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటు మీ మెథడాలజీకి సంబంధించి కంటెంట్‌, మెథడాలజీ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. 


పేపర్‌-1కు డీఈడీ అభ్యర్థులు అర్హులు కాగా... పేపర్‌-2కు బీఈడీ చేసిన వాళ్లు అర్హులు అవుతారు. మొదటి పేపర్ రాసిన వాళ్లు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) ఉద్యోగాలు రాసుకోవచ్చు. పేపర్‌ 2 రాసి ఉత్తీర్ణులైన వాళ్లు స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) ఉద్యోగాలకు పోటీ పడేందుకు అర్హత సాధిస్తారు.


150కి 150 వచ్చిన వాళ్లకు డీఎస్సీలో 20 మార్కులు మెరిట్ ఉంటుంది. అందుకే ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ పరీక్షలోజనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులైతే... 50 శాతం వస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీలు సహా ఇతర కేటగిరీ అభ్యర్థులకేతే 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.


 


Also Read: తెలంగాణలో వర్కింగ్ మదర్స్‌కి గుడ్ న్యూస్- ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు