YS Jagan On AP Governament: ఏపీలో చీకటి పాలన నడుస్తోందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.  స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితులు  ఎక్కడా లేవన్నారు.  ప్రశ్నించే స్వరం ఉండకూడదని.. అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారని జనగ్ మండిపడ్డారు.  రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు.. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు.. వసతి దీవెన కూడా ఇవ్వలేదన్నారు.  


విద్యా వ్యవస్థను నాశనం చేశారు !          


ప్రభుత్వ స్కూల్స్ గాడి తప్పాయని..  ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయన్నారు.  ఈ-క్రాప్ లేదు, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిందన్నారు.  విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పథకాలన్నీ ఆగిపోయాయని మండిపడ్డారు.  ఇప్పుడు డోర్‌ డెలివరీ ఊసే లేకుండా పోయిందని..  5 నెలల్లోనే 91 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు.   ఏడుగురు చనిపోయారు.. ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది.   ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఆర్‌బీకేలను నిర్వీర్యం చేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను గాలికి వదిలేశారని.. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిలయ్యిందని జగన్ ఆరోపించారు.                         


మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్


టీడీపీ కార్యకర్తలే నేరాలు చేస్తున్నారు !                  


తెలుగు దేశం పార్టీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నేరాల్ని అరికట్టకుండా.. ప్రొత్సహిస్తోంది. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారు. నిందితుడు.. టీడీపీకి చెందిన వ్యక్తే. బద్వేల్‌ ఘటన.. అత్యంత దారుణం. పెట్రోల్‌ పోసి బాలికను చంపారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఘటన జరిగిందని అన్నారు.  అత్తాకోడళ్లపై అత్యాచారం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురంలో ఓ ఘటన జరిగిందన్నారు. ప్రతీచోటా ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.                       


బ్యాలెట్ ఎన్నికలకు వైసీపీ దూరం - గ్రాడ్యూయేట్ ఎలక్షన్స్‌లో పోటీ చేయడం లేదని ప్రకటన !    


సోషల్ మీడియా అరెస్టులపై కీలక వ్యాఖ్యలు                      


పోలీసులు చట్టాలను ఉల్లంఘిచి మరీ అరెస్టులు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని అన్నారు. పాత పోస్టులపై ఇప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. ఇంట్లో సభ్యులకు కూడా చెప్పుకుండా తీసుకెళ్లారని ఆరోపించారు. కుటుంబ సభ్యులు అడిగినా తీసుకెళ్లలేదని చెబుతున్నారన్నారు.