YCP Not contesting in the two graduate MLC elections: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రెండు  పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేయకూడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రకటించారు. పోలీసులను పెట్టి వైసీపీ నేతల్ని ఇష్టానుసారంగా అరెస్టులు చేయిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక సక్రమంగా జరిగ అవకాశం లేదన్నారు. అందుకే తాము ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడయ్యమని ఆయన చెబుతున్నారు. 


గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు  


గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. పార్టీ నేతలను గ్రాడ్యూయేట్ ఓటర్లుగా నమోదు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నమోదు ను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. అయితే వైసీపీ తరపున అభ్యర్థిుల్ని ఖరారు చేయకపోవడంతో వారు తమ పార్టీ ఓటర్లను కూడా నమోదు చేయించలేకపోయారు.                    


మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు


అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం       


అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మూడు పట్టభద్రుల గ్రాడ్యూయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. అప్పట్లో తమ ఓటర్లు వేరు అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. గ్రాడ్యూయేట్లలో వైసీపీకి ఓటేసేవారు తక్కువగా ఉంటారన్న అంచనాతో పాటు మళ్లీ ఓడితే రకరకాల సమస్యలు వస్తాయన్న కారణంగా వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.  తక్కువ ఓట్లు నమోదు అయితే ఇంకా ఇబ్బందులు వస్తాయని పార్టీ నేతలు, వ్యూహకర్తలు నిర్ణయించడంతో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసేవారు. 



Also Read: రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు




ఇటీవల ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత వైసీపీ క్యాడర్ ఇంకా కోలుకోలేదు. ఇలాంటి సమయంలో వారిని మరో ఎన్నికకు సమాయత్తం చేయడం కష్టమని అనుకుననారు. అదే సమయంలో విశాఖలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పోటీకి టీడీపీకి దూరంగా ఉండటంతో వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరం ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వచ్చినా.. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హతా వేటు చట్ట విరుద్దమని హైకోర్టు రద్దు చేసింది. దీంతోఆ ఎన్నిక జరగడంపై సందిగ్ధం ఏర్పడింది.  వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడును ఖరారు చేశారు.