Discount On Mahindra Thar: మహీంద్రా థార్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్ ఎస్‌యూవీ. ఇప్పుడు మహీంద్రా తన ఐకానిక్ 3 డోర్ థార్‌పై రూ. 3 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫ్ రోడర్ ఎస్‌యూవీ 5 డోర్ మోడల్ థార్ రోక్స్‌ను ప్రారంభించినప్పటి నుంచి 3 డోర్ మోడల్‌పై ప్రయోజనాలు అందిస్తున్నారు. దీంతో పాటు 5 డోర్ మోడల్ రాక కారణంగా మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గింది.


రూ. మూడు లక్షల తగ్గింపు దీనిపై...
మహీంద్రా 3 డోర్ థార్‌పై డిస్కౌంట్లు గత కొన్ని నెలలుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ ప్రారంభంలో ఈ ఎస్‌యూవీపై రూ. 1.6 లక్షల వరకు ప్రయోజనాలు అందించారు. ఇప్పుడు మహీంద్రా థార్‌పై ఈ తగ్గింపు ఆఫర్ రూ.మూడు లక్షలకు పెరిగింది.


దీనిపై ఎక్కువ ప్రయోజనం
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్‌లో ఎక్కువ బెనిఫిట్స్ లభించవచ్చు. ఈ వేరియంట్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్‌లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీని నాలుగు వేరియంట్‌లు భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని ఎర్త్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 15.40 లక్షల నుంచి మొదలై రూ. 17.60 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు మహీంద్రా థార్ బేస్ వేరియంట్ ధర రూ. 11.35 లక్షలుగా ఉంది. దాని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 17.60 లక్షల వరకు ఉంది.



Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!


మహీంద్రా థార్ ఇంజిన్ ఎలా ఉంది?
మహీంద్రా థార్ మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఎస్‌యూవీ టీజీడీఐతో కూడిన 2.0 లీటర్ ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఇంజన్‌తో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజన్ 112 కేడబ్ల్యూ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 300 ఎన్ఎం టార్క్‌ను, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


మహీంద్రా థార్ 1.5 లీటర్ ఎంహాక్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కూడా పొందుతుంది. ఈ ఇంజన్ 87.2 కేడబ్ల్యూ పవర్, 300 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎస్‌యూవీ 2.2 లీటర్ ఎంహాక్ టర్బో డీజిల్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 97 కేడబ్ల్యూ శక్తిని, 300 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా థార్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవలే విడుదల అయిన మహీంద్రా థార్ రోక్స్ 10 వేలకు పైగా బుకింగ్స్‌ను అందుకుంది.



Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!