Donald Trump News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి మాత్రం ఆసక్తికరమైన వాదన తెరపైకి తీసుకొచ్చింది. తాను డొనాల్డ్ ట్రంప్ కూతురినని మీడియా ముందుకు వచ్చింది. ట్రంప్ తన తండ్రి అని ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు వద్దని వాదిస్తోంది. 


అమ్మాయి తనను తాను ముస్లిం యువతిగా చెబుతూనే తాను డొనాల్డ్ ట్రంప్ బయోలాజికల్ బిడ్డగా చెప్పుకుంది. ఈ వీడియో ప్రామాణికత గురించి, ఆ యువతి మానసిక స్థితి గురించి నెటిజన్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మీడియా ముందు మాట్లాడిన ఆమె ఈ విషయాలు చెప్పడం సంచలనంగా మారింది. క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయింది. బ్రిటీష్ ప్రజలు పాకిస్థాన్‌కు వచ్చి తనను చూసినప్పుడు ఆశ్చర్యపోతారని కూడా ఆ అమ్మాయి అంటోంది. కూతురిని బాగా చూసుకోలేనని ట్రంప్ తన తల్లికి ఎప్పుడూ చెప్పేవారని ఆమె అన్నారు. ఈ వీడియోని Xలో @pakistan_untold ద్వారా అనే అకౌంట్‌లో పోస్టు చేశారు. దీనికి ఇప్పటివరకు 77 వేలపైగా వ్యూస్ వచ్చాయి.  






రివేంజ్‌కు ఇదే సరైన సమయం: ముస్లిం యువతి  


మరో ముస్లిం యువతి పాకిస్థాన యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అఘాయిత్యాలకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ట్రంప్ విజయంతో సంతోషిస్తున్న ఆమె రియల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే పాకిస్థాన్ పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్త్‌ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.


పాకిస్తానీ యూట్యూబర్ షోయబ్ చౌదరి భారత్‌కు చెందిన నాజియా ఇలాహి ఖాన్‌ను చర్చకు ఆహ్వానించారు. ఈ షోలో ట్రంప్ విజయంతో భారత్‌కు ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయనే అంశంపై చర్చ జరిగింది. భారత్‌లో ప్రధాని మోదీ, యోగి జంటగా ఉన్నట్లే అమెరికాలో ఎలాన్ మస్క్, ట్రంప్‌ జోడీ అని నజియా అభిప్రాయపడ్డారు. 2016లో కూడా ట్రంప్ ప్రకటనలో హిందువుల పట్ల తనకున్న భావోద్వేగాలు వివరించారన్నారు ఈసారి కూడా అదే కనిపించిందని, కమలా హారిస్ మాత్రం హిందువులకు మద్దతు ఇవ్వలేదన్నారు. 


తన ప్రచార సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ట్రంప్ తన గళాన్ని వినిపించారన్నారు ఇలాహి ఖాన్. ఇప్పుడు గెలిచారు కాబట్టి హిందువులు తమపై జరిగిన అకృత్యాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. 



అమెరికా రాజకీయాల్లోకి ట్రంప్‌ సంచలనం 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యారు. గతంలో 2016లో జరిగిన తొలి ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేసి విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఈసారి ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి రికార్డులు తిరగ రాశారు. గతంలో రెండుసార్లు వరుసగా విజయం సాధించిన అధ్యక్షులు ఉన్నారు. కానీ ఇలా ఒకసారి గెలిచి మధ్యలో ఓడిపోయి మళ్లీ గెలిచింది ఇద్దరే ఇద్దరు ఉన్నారు వారిలో ట్రంప్‌ రెండో వ్యక్తి. ఇంతకుముందు, గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ 1884, 1892లో రెండుసార్లు ఈ పద్ధతిలో అధ్యక్ష పదవిని చేపట్టారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ట్రంప్‌ ఈ పదవిని చేపట్టారు.  


Also Read: ట్రంప్‌ గెలుపుతో భారత్‌కు లాభమా ? నష్టమా ?