స్టార్ హీరోయిన్ సమంత‌ (Samantha) సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.‌ ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్  (Citadel Honey Bunny OTT) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సిరీస్ ఎలా ఉంది? అనే విషయం పక్కన పెడితే...‌‌ అందులో సమంత నటించిన ఓ సన్నివేశం విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...


బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్!
ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'కు, ఈ సమంత 'సిటాడెల్ హనీ బన్నీ'కి ఓ కనెక్షన్ ఉంది.‌ అది పక్కన పెడితే... స్పై థ్రిల్లర్ సిరీస్ అంటే కాస్త మసాలా ఉండడం కామన్.‌ అప్పట్లో ప్రియాంక చోప్రా సీన్లు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ స్థాయిలో సమంత రొమాంటిక్ సీన్స్ ఏవి చేయలేదు. కానీ రెండు అంటే రెండు లిప్ లాక్స్ చేశారు.


Also Readసిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?










బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత మధ్య లిప్ లాక్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకుముందు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 వెబ్ సిరీస్‌లో ఓ సన్నివేశం కూడా ఇదే విధంగా వైరల్ అయింది. అప్పట్లో అక్కినేని నాగ చైతన్య నుంచి సమంత విడాకులు తీసుకోవడంతో... ఇటువంటి సన్నివేశాలు చేయడం వల్ల వైవాహిక జీవితంలో గొడవలు వచ్చాయని ప్రచారం జరిగింది. 


Also Read'పుష్ప 2' నుంచి డీఎస్పీని తప్పించిన బన్నీ - సుక్కు? లాస్ట్ మినిట్‌లో వస్తున్న తమన్?



ఇప్పుడు మరోసారి సమంత లిప్ లాక్ వైరల్ అవుతుంది. కొంత మంది ఆవిడ ఆ సన్నివేశాలు చేయడానికి తప్పుపడుతున్నారు. ఇంకొంత మంది సమంతకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే... 'సిటాడెల్ హనీ‌ బన్నీ'లో రొమాంటిక్ సన్నివేశాలు ఏమీ లేవు. ఏదో ఉన్న ఒక ట్రెండు సన్నివేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇందులో సమంత యాక్షన్ సీన్లు బాగా చేశారని కామన్ ఆడియన్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వరుణ్ ధావన్ కంటే ఆమెకు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండడంతో పాటు వాటిని బాగా డిజైన్ చేశారు.