Top 10 Headlines Today:
షర్మిల తేల్చేస్తారా?
వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల, జగన్ సహా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇడుపులపాయకు రానున్నారు. ఎవరికి వాళ్లు వేర్వేరుగా వస్తున్నారు. వైఎస్ సమాధికి నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంక టీంతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. పదే పదే వీటిని ఆమె ఖండిస్తున్నా తరచూ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఈ పుకార్లకు ఊతమిస్తున్నాయి. మొత్తానికి ఈ విషయంపై ఇడుపులపాయ వేదికగా ఏదో ఒకటి తేల్చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ముందస్తుకు వెళ్తారా?
పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు వస్తాయని మళ్లీ విస్త్రతమైన చర్చ ప్రారంభమయింది. వచ్చే నవంబర్, డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీని ప్రక్షాళన చేయడం, కేంద్ర మంత్రి వర్గ విస్తరణను చేయనుండటం మాత్రమే ఎన్డీఏను కూడా బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కొత్త పార్టీలను చేర్చుకుంటున్నారు. అందుకే మందస్తుకు మోదీ కూడా రెడీ అయ్యారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సబ్సిడీ టమాటా
పెట్రోల్ కంటే వేగంగా దూసుకెళ్తున్న టమాటా ధరకు ఇప్పట్లో కళ్లెం పడేలా కనిపించడం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిచర్యలకు దిగాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సబ్సిడీపై టమాటాను పంపిణీ చేస్తున్నాయి. బయట మార్కెట్‌లో ఎక్కువ ధర ఇచ్చిన కొనలేని వినియోగదారులకు బెస్ట్‌ప్రైస్‌కే టమాటా అందిస్తున్నాయి ప్రభుత్వాలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణలో కర్ణాటక ఫార్ములా వర్కౌట్ అవుతుందా?
ఓ సినిమా హిట్ అయిందని అదే ఫార్మలాతో సినిమాలు తీయడం సహజమే. అయితే ఆ ఫార్ములాలో వైవిధ్యం లేకపోతే మొదటికే మోసం వస్తుంది. సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ..కర్ణాటకలో ఉపయోగించిన ఫార్ములానే తెలంగాణలో ఉపయోగిస్తోంది. కర్ణాటక తరహాలోనే తెర ముందు చేయాల్సినవి చేస్తూనే తెర వెనుక ప్రయత్నాలు కూడా జోరుగా నిర్వహించేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేడు మోదీ టూర్
ప్రధాని నరేంద్రమోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. దీని కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో వారణాసి నుంచి మోదీ బయల్దేరి తొమ్మిదిన్నరకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పది గంటలకు మామునూరు చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గంలోభద్రకాళి టెంపుల్‌కు చేరుకుంటారు. అక్కడ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే 15 నుంచి 20 నిమిషాలు గడపనున్నారు మోదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఇన్‌ఛార్జ్‌లో మార్పులు
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ తన సన్నాహాలను జోరుగా చేసుకుంటోంది. తాజాగా అన్ని రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులను నియమించింది. తెలంగాణ ఇంచార్జ్ గా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ కు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు సహాయకుడిగా..కో ఇంచార్జ్ గా.. ప్రస్తుత తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న సునీల్ బన్సల్ వ్యవహరిస్తారు. ప్రకాష్ జవదేకర్ 2014 ఎన్నికల సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో బీజేపీ తరపున కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ప్రకాష్ జవదేకర్ అంతా తానై వ్యవహరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వెళ్లారు. పార్టీ పనుల్లో ఇటీవల బిజీగా ఉంటున్నారు. ఎన్నికల టాస్క్ లు నిర్వహించడంలో అపారమైన అనుభవం ఉండటంతో మరోసారి ప్రకాష్ జవదేకర్ ను ఇంచార్జ్ గా తెలంగాణకు నియమించినట్లగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3 రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన ఖరారైంది. జూలై 8న ఆయన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొనేందుకు వైఎస్సార్ జిల్లాకు వెళ్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్ ఘాట్‌కు సీఎం జగన్ చేరుకుని జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించనున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక ఇడుపులపాయలో తన నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అనంత్ మహేశ్వరి రాజీనామా
మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి కంపెనీ నుండి వైదొలుగుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పదవికి అనంత్ మహేశ్వరి రాజీనామా చేశారు. అనంత్ రాజీనామా విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ లో తమ సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలకుగానూ ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో ఆయన మరింత మెరుగ్గా రాణించాలని, చేపట్టే పనుల్లో విజయవంతం కావాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఫారిన్ కరెన్సీ నిల్వల విజృంభణ
ఇండియా వద్ద ఉన్న ఫారిన్ కరెన్సీ నిల్వలు మరోసారి విజృంభించాయి. జూన్ 30, 2023తో ముగిసిన వారానికి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.85 బిలియన్ డాలర్లు పెరిగి 595.05 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు వారంలో ఇవి 593.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ 30, 2023తో ముగిసిన వారానికి, విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets) 2.53 బిలియన్ డాలర్ల జంప్‌తో 527.79 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కష్టాల్లో ఇంగ్లండ్
రెండు టెస్టులు ఓడినా.. మరో టెస్టు ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉన్నా ఇంగ్లాండ్ ఆటతీరులో మార్పు రాలేదు. అదే బజ్ బాల్ ఆటతో కొత్త తలనొప్పులను తెచ్చుకుంటున్నది. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 263 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి