పెట్రోల్‌ కంటే వేగంగా దూసుకెళ్తున్న టమాటా ధరకు ఇప్పట్లో కళ్లెం పడేలా కనిపించడం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిచర్యలకు దిగాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సబ్సిడీపై టమాటాను పంపిణీ చేస్తున్నాయి. బయట మార్కెట్‌లో ఎక్కువ ధర ఇచ్చిన కొనలేని వినియోగదారులకు బెస్ట్‌ప్రైస్‌కే టమాటా అందిస్తున్నాయి ప్రభుత్వాలు. 


టమాటా ధర వందరూపాయలు దాటినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. ఏపీలో రైతు బజార్లలో యాభై రూపాయలకే టమాటాను అమ్ముతోంది. గతంలో ఉల్లిగడ్డలను ఇలా సబ్సిడీపై అమ్మేవారు. ఈసారి టమాటాను విక్రయిస్తున్నారు. 


ఉత్తరాదిలో టమాటా ధర 250రూపాయల పైగానే పలుకుతోంది. దక్షిణాదిలో మాత్రం 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో వందరూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వాటిని ప్రజలకు కిలో 50 రూపాయలకే ఇస్తున్నారు. 


ఏపీ వ్యాప్తంగా కేవలం 103 రైతుబజార్‌లలో మాత్రమే సబ్సిడీ టమాటా విక్రయిస్తున్నారు. డిమాండ్ భారీగా ఉన్న ఈ పరిస్థితుల్లో దీన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో మనిషికి రెండు కిలోల వరకు ఇస్తున్నారు. 


జూన్‌ 28 నుంచి ఏపీ ప్రభుత్వం టమాటాను సబ్సిడీపై అందిస్తోంది. ఈ టమాటా కోసం రైతు బజార్లలో ప్రజలు బార్లు తీరుతున్నారు. తెచ్చిన సరకు త్వరగా అయిపోవడంతో కొంతమంది నిరాశగా వెనుదిరుగుతున్నారు. బయట మార్గెట్‌లో పరిస్థితి చక్కబడే వరకు ధరలు అదుపులోకి వచ్చే వరకు టమాటాను సబ్సిడీపై అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 


సబ్సిడీపై అందిస్తున్న ప్రభుత్వానికి టమాటా సేకరణ పెద్ద సమస్యగా మారింది. వివిధ రాష్ట్రాల అధికారులతో మాట్లాడి సరకును తెప్పిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 422 టన్నులను సేకరించి ప్రజలకు అందిస్తున్నారు. దీని కోసం నాలుగు కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. 


తమిళనాడులో రేషన్ దుకాణాల్లో విక్రయం


రోజూ ఎక్కువగా వినియోగించే టమాటాలను అందరికీ అందుబాటులో ఉంచాలని దాదాపు 50 శాతం మేర ధరలు తగ్గించి తమిళనాడు ప్రభుత్వం. రేషన్ షాప్‌లలో టమాటా విక్రయించాలని నిర్ణయించింది. బియ్యం, పప్పు, నూనె ఎలాగైతే రేషన్ షాప్‌లలో చౌక ధరలకు లభిస్తాయో అలాగే టమాటాలనూ తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. చెన్నైలోని రేషన్ దుకాణాల్లో ఇది అమలు చేసింది ప్రభుత్వం. కిలో రూ.60కే విక్రయిస్తోంది. ముందుగా చెన్నైలోని రేషన్ షాప్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తరవాత రాష్ట్రవ్యాప్తంగా ఇది అమల్లోకి తీసుకొచ్చింది






Also Read: Chandrayaan 3 Launch: చంద్రయాన్-3 ప్రయోగానికి డేట్, టైం ఫిక్స్ - ఇస్రో అధికారిక ప్రకటన