Top 10 Headlines Today: 


'కిషన్ రెడ్డికి టఫ్‌ టాస్క్‌


తెలంగాణ భారతీయ జనతా పార్టీతో ఆ పార్టీ హైకమాండ్ ఎన్నికలకు ముందు  ఆ ఆట ఆడుకుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడ్ని మార్చడం ద్వారా మొత్తం సిస్టమ్ కదిలిపోయేలా చేసింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఒక్కరు కూడా ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. పార్టీలో ఎవరు ఉంటారు.. ఎవరు వెళ్లిపోతారు.. ఎవరికి ఎలాంటి పదవులు దక్కుతాయన్న చర్చలే జరుపుతున్నారు.  అసలు బీజేపీ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడి మళ్లీ బీజేపీ రేసులోకి రావాలంటే చాలా సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వైఎస్‌ఆర్‌సీపీ ఎన్డీఏలో చేరుతుందా?


ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి జగన్ మోహన్ రెఢ్డి హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఒక్క రోజులోనే  బీజేపీ అగ్రనేతలిద్దరితోనూ సమావేశమయ్యారు మళ్లీ తిరిగి తాడేపల్లికి వచ్చేశారు. అయితే ఆయన ఏ అంశాలపై చర్చ జరిగిదంన్నదానిపై స్పష్టత లేదు కానీ.. కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న  సమయంలో ఆయన పర్యటన ఢిల్లీ వర్గాల్లో విస్తృత చర్చకు కారణం అవుతోంది. ఇప్పటికే ఎన్డీఏలో చేరేందుకు వైసీపీ ఆసక్తి చూపించిందన్న ప్రచారం జరుగుతూండటమే దీనికి కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మార్గదర్శిపై ఉండవల్లి కామెంట్స్....


మార్గదర్శి వ్యవహారంలో తాను పదిహేను సంవత్సరాల కిందట చెప్పినవన్నీ నిజాలేనని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి ఆరుణ్ కుమార్ అన్నారు. ఈ విషయాలను  మార్గదర్శి యాజమాన్యం కూడా ఒప్పుకుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అతి భారీ వర్షాలు


నిన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ తీరం పరిసరాల్లాలోని, పశ్చిమమధ్య బంగాళాఖతంలో ఉన్న ఆవర్తనం ఈ రోజు ఉత్తర & పరిసరాల్లోని, మధ్య బంగాళాఖతంలో సగటు సముద్ర మట్టంకి 1.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వర్షాకాలం జాగ్రత్త


హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించడంతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం వచ్చినందున అధికారులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొంత కాలం క్రితం ప్రారంభించిన వార్డు కార్యాల‌యాల వ్యవ‌స్థపై మంత్రి కేటీఆర్ బుధ‌వారం (జూలై 5) సాయంత్రం స‌మీక్ష చేశారు. వర్షాకాలం వచ్చినందున అందరూ సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కొత్తగా 8 మెడికల్ కళాశాలలు


తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో 26 వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తుండగా.. తాజాగా మరో 8 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరబోతోంది. తాజా ఆదేశాలతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 9 ఏళ్లలో జిల్లాకో వైద్య కళాశాల దిశగా సర్కారు అడుగులు వేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు జారీ అయితే వచ్చే విద్యా సంవత్సరానికి జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


చంద్రయాన్ మిషన్ ఉద్దేశాలపై ఇంట్రస్టింగ్ స్టోరీ


చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లిరావే అని అమ్మ పాడే పాటతో మనకు పరిచయమౌతుంది చందమామ. ఈ అనంతమైన విశ్వంలో మనిషి భూమిని దాటి అడుగు పెట్టిన ఏకైక ప్రదేశం చంద్రుడు. భూమికి సుమారుగా 3లక్షల 84వేల కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్రుడు..ఆల్మోస్ట్ భూమి ఏర్పడినప్పటి నుంచి ఉంది. ఓ చిన్నసైజు గ్రహం భూమిని ఎప్పుడో 4 బిలియన్ సంవత్సరాల క్రితం అమాంతం ఢీ కొట్టడం ద్వారా చందమామ ఏర్పడి ఉండవచ్చనేది ఒకవాదన. భూమికి సహజ ఉపగ్రహంలా ఓ నిర్దిష్ట కక్ష్యలో భూమి చుట్టూ తిరుగతూ భూమిపై సముద్రంలో అలలు ఏర్పడటానికి, వాతావరణాన్ని ప్రభావితం చేయటానికి కారణమౌతుంది చందమామ. మరి అలాంటి చందమామ పై ప్రయోగాలు ఎప్పటి నుంచో మొదలయ్యాయో తెలుసా? ఈ నెల 13న మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చంద్రుడిపైకి చేస్తున్న ఈ టైమ్ లో చంద్రుడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, చంద్రయాన్ మిషన్ ఉద్దేశాలు వరుస కథనాల రూపంలో ఏబీపీ దేశం మీకు అందిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సలార్‌ టీజర్ వచ్చేసింది


సలార్... సలార్... సలార్... మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎదురు చూస్తున్నది ఈ సినిమా కోసమే! కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... మాఫియాకు బాస్, బడా గ్యాంగ్‌స్టర్ పాత్రకు ప్రభాస్ కంటే పర్ఫెక్ట్ ఎవరు ఉంటారు? అందుకని, అభిమానులు మాత్రమే కాదు... సగటు సినీ ప్రేక్షకులలో కూడా 'సలార్' (Salaar) సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


టీ20 టీం రెడీ


వెస్టిండీస్ పర్యటనలో భాగంగా  వచ్చే నెల 3 నుంచి విండీస్ తో  ఐదు మ్యాచ్ ల టీ2‌0 సిరీస్ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా  వివరాలను వెల్లడించింది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియాకు  సూర్యకుమార్ యాదవ్ ను వైస్ కెప్టెన్ గా నియమించగా.. గత రెండు ఐపీఎల్ సీజన్స్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో కూడా మెరుపులు మెరిపిస్తున్న ముంబై సంచలనం యశస్వి జైస్వాల్, ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మలకు తొలిసారి టీ20 టీమ్ లో చోటు దక్కింది.  విండీస్ తో టీ20 సిరీస్ కు తప్పకుండా ఎంపికవుతాడని అందరూ భావించినా.. కోల్కతా నైట్ రైడర్స్  ఆపద్బాంధవుడు రింకూ సింగ్ కు నిరాశ తప్పలేదు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


ఎన్సీపీలో మరో కీలక పరిణామం  


మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పగ్గాలను శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ లాగేసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తిరుగుబాటు వర్గం శరద్ పవార్‌ త పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదని, అజిత్ పవార్ తమ అధినేత అని పేర్కొంది. ఈ మేరకు ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తు తమకు చెందుతాయని ఈసీకి రాసిన లేఖలో అజిత్ పవార్ ప్రస్తావించారు. 35 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, అజిత్ పవార్ ను ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా గుర్తించాలని ఈసీని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి