Morning Top News:


 లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌, వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూసేకరణ రద్దు చేసి 24 గంటలకు గడవక ముందే ప్రభుత్వం మరో ట్విస్ట ఇచ్చింది. అక్కడ ఫార్మాక్లస్టర్ కోసం మాత్రమే భూసేకరణ రద్దు చేశామని తేల్చింది. పూర్తిగా అక్కడ భూసేకర ప్రక్రియ నిలిపివేయాలనే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. పారిశ్రామిక కారిడార్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


రెడ్‌ అలర్ట్ : నేడు తీరం దాటనున్న తుపాన్.. 

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ఇవాళ మామల్లపురం-కరైకల్ మధ్య తీరం దాటనుందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. తుపాను తీరం దాటే కొద్దీ భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడనం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కి. మీ వేగంతో గాలులు వీస్తాయి. మధ్యలో గంటకు 75 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

సీజ్ ద షిప్.. నెట్టింట పవన్ హల్‌చల్‌ 

జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ పై పరిశీలన చేయడానికి వెళ్లినప్పటి నుంచి ఒకే మాట ట్రెండ్ అవుతోంది. ఆ మాట సీజ్ ద షిప్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట ట్రెండ్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే విదేశీ సోషల్ మీడియా యూజర్లకు ఇదో మిస్టరీ అనిపించింది. అందుకే అసలేంటి ఈ సీజ్ ద షిప్ అని ఆరా తీయడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ క్రేజ్ అలా ఉంటుందని వారికి ఇప్పుడే తెలిసి ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రేవంత్ కీలక ఆదేశాలు


లబ్ధిదారులకు ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి   అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై ఆయన నివాసంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు సంబంధించి ప్ర‌త్యేక కోటా ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



 

అల్లు అర్జున్‌ వీడియోపై రేవంత్‌ రియాక్షన్

 డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా నటుడు అల్లు అర్జున్‌ ప్రత్యేక వీడియో చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘‘డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్‌ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’’ అని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

సంక్రాంతి తరువాత జనంలోకి జగన్

వైసీపీ బాస్ వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. తాడేపల్లిలో పలువురు నేతలతో శుక్రవారం భేటీ అయిన జగన్.. జిల్లాల పర్యటనపై ప్రకటన చేశారు. జిల్లాల పర్యటనల్లో నేరుగా పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. దీనిలో భాగంగా ప్రతి బుధ, గురువారాల్లో పూర్తిగా కార్యకర్తలతోనే గడపనున్నారు. పార్టీ బలోపేతానికి వారి నుంచి సలహాలు తీసుకోనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇటీవలే శబరిమల వెళ్లే భక్తుల కోసం 62 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయగా.. తిరుపతి వెళ్లే వారి కోసం రెండు వీక్లీ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయనుంది. హిసార్ - తిరుపతి వీక్లీ స్పెషల్ డిసెంబర్ 7 నుంచి 17 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శనివారం హిసార్‌లో బయలుదేరి మరుసటి రోజు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - హిసార్ వీక్లీ స్పెషల్  డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకూ నడుస్తుంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

సీఎం వద్ద ఫ్లైయాష్ పంచాయతీ

రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫ్లైయాష్ వివాదం సచివాలయానికి చేరింది. సీఎం చంద్రబాబు పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి,  భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎంతో సమావేశమయ్యారు. తాను జ్వరం వల్ల హాజరు కావడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి  సమాచారం ఇచ్చారు. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదంతో కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

రిషితేశ్వరి కేసును కొట్టేసిన కోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్ కు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్, సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. రిషితేశ్వరి ఆత్మహత్య అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసును కొట్టేసింది. కోర్టు కొట్టేయడంతో.. ఆమె తల్లిదండ్రులు బోరుమన్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


సమంత ఇంట్లో తీవ్ర విషాదం

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మరణించారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌ష్టాగ్రామ్ వేదికగా తెలిజేశారు. ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో ఎమోషనల్ పోస్టు చేశారు. ఈ పోస్టు చూసిన నెటిజన్స్ సమంతకు సానుభూతి తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

భారత జట్టు పాకిస్తాన్‌కు  వెళ్లేది లేదు 

 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అనే అనుమానాలకు తెరపడింది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీసీసీఐ చెప్పిన విషయాన్నే విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..