Revanth Reddy About Allu Arjun Video | హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీడియోపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెరుగైన సమాజం కోసం తన వంతుగా అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. పిల్లలు, తెలంగాణ యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించడానికి ప్రజా చైతన్య యాత్రలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పాల్గొనడంతో సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన రాష్ట్రం, మెరుగైన సమాజం కోసం అందరం చేతులు కలుపుదామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా  పిలుపునిచ్చారు. అల్లు అర్జున్ ఇచ్చిన మంచి మెస్సేజ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అభినందనలు తెలిపినందుకు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న పుష్ప 2 మూవీ


సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 వచ్చే వారం విడుదలకు సిద్ధంగా. పుష్ప 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యువతకు మేలు చేసేందుకు ఓ వీడియో పోస్ట్ చేశారు. డ్రగ్స్ ఫ్రీ సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మత్తు ఇచ్చే మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధితులకు అండగా నిలవాలని అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 






మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిస్తే తెలంగాణ యాంటీ నార్కో డ్రగ్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908కి కాల్ చేసి సమాచారం అందించాలని అల్లు అర్జున్ సూచించారు. వాళ్లు డ్రగ్స్ కు బానిసలైన వారిని మామూలు మనిషి అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం అంతా కలిసి పనిచేద్దామని ఎక్స్ లో అల్లు అర్జున్ చేసిన వీడియో పోస్ట్ వైరల్ అయింది. ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోదని, వారిని మంచి మార్చేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. మెరుగైన సమాజం కోసం, బాధ్యతాయుతంగా వ్యవహరించి యువతకు పిలుపునిచ్చిన అల్లు అర్జున్‌ చర్యను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.



Also Read: MLC Kavitha: 'జైలు జీవితం చిన్న గ్యాప్ మాత్రమే' - సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ 


సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సందేశం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి పబ్‌లపై ఫోకస్ చేస్తోంది. ఎక్కడైనా డ్రగ్స్ మాట వినిపిస్తే చాలు టీమ్స్ అక్కడికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేపట్టి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మూలాలను నాశనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.