Pawan is shaking the social media with one word Seize the Ship : జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యామ్ కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ పై పరిశీలన చేయడానికి వెళ్లినప్పటి నుండి ఒకే మాట ట్రెండ్ అవుతోంది. ఆ మాట సీజ్ ద షిప్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట ట్రెండ్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే విదేశీ సోషల్ మీడియా యూజర్లకు ఇదో మిస్టరీ అనిపించింది. అందుకే అసలేంటి ఈ సీజ్ ద షిప్ అని ఆరా తీయడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ క్రేజ్ అలా ఉంటుందని వారికి ఇప్పుడే తెలిసి ఉంటుంది.
బియ్యం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం
కాకినాడ పర్యటనను హఠాత్తుగా పెట్టుకున్న పవన్ ..ఎవరూ ఊహించక ముందే పోర్టులోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టిన వెంటనే తనదైన యాక్షన్‌లోకి దిగిపోయారు. పోర్టులో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న షిప్ వరకూ అన్ని చోట్లకు వెళ్లారు.అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ షిప్ దగ్గరకు వెళ్తున్న సమయంలో పోర్టు అధికారులు సహకరించలేదు. అయినా పవన్ పట్టు వీడలేదు. షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలా ఆదేశాలు ఇస్తున్న సమయంలో సీజ్ ద షిప్ అని పవన్ అన్న మాటలే వైరల్ అవుతున్నాయి.
పవన్ క్రేజ్‌పై సోషల్ మీడియాలో చర్చ
పవన్ కల్యాణ్ అన్న సీజ్ అన్న మాట ఇంతలా ట్రెండ్ అవడంతో.. పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌పైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది.
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న పవన్
ఏపీ డిప్యూటీ సీఎంగానే కాదు సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమంలో ఆయన తనదైన ప్రత్యేకత చూపుతున్నారు అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఎక్కడ ఎలాంటి మాటాలు మాట్లాడినా వైరల్ అయిపోతున్నాయి.