Samantha Ruth Prabhu Father Joseph death news: స్టార్ హీరోయిన్, తెలుగుతోపాటు తమిళ హిందీ ప్రేక్షకులలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అగ్ర నటి సమంత రూత్ ప్రభు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ తుది శ్వాస విడిచారు.
సొసైల్ మీడియాలో సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha emotional post on father death: తండ్రి జోసెఫ్ మరణ వార్తను సోషల్ మీడియాలో సమంత రూత్ ప్రభు ధృవీకరించారు. ''మనం మళ్ళీ కలిసే వరకు నా హృదయం ముక్కలై ఉంటుంది నాన్నా'' అని ఆవిడ పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత చేసిన పోస్ట్ కింద చూడండి.
చెన్నైలో సెటిలైన తెలుగు ఆంగ్లో ఇండియన్
సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు ఆంగ్లో ఇండియన్. అయితే, ఆయన చెన్నైలో సెటిల్ అయ్యారు. ఆమె తల్లి నైనిట్ట సిరియన్ మలయాళీ. వాళ్ళది ప్రేమ వివాహం.
నాగ చైతన్యతో విడాకులు సమంత తండ్రికి ఇష్టం లేదా?
సమంత హీరోయిన్ కావడం వెనుక ఆయన తండ్రి సపోర్ట్ ఉందని చెన్నై సినిమా వర్గాల్లో చాలా మంది చెబుతారు. కుమార్తె ఇష్టాన్ని గౌరవించి ఆయన ప్రోత్సాహం అందించారని చెబుతారు. అమ్మాయి స్టార్ హీరోయిన్ అయినా జోసెఫ్ మీడియా ముందుకు వచ్చింది తక్కువ. తెర వెనుక ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే, నాగ చైతన్యతో సమంతకు విడాకులు అయిన కొన్నాళ్ళకు ఆయన వర్గాల్లో నిలిచారు.
అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి ఫోటోలను జోసెఫ్ ఒకసారి ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అది కూడా వాళ్లిద్దరూ విడిపోతున్నట్లు అక్టోబర్ 2021లో ప్రకటించిన ఏడాది తర్వాత. ''చాలా రోజుల క్రితం ఓ జీవితం (కథ) ఉండేది. కానీ, ఇప్పుడు అది లేదు. అందుకని కొత్త జీవితం, కొత్త అధ్యాయం మొదలు పెట్టాలి'' అని పేర్కొన్నారు. దాంతో ఆయనకు విడాకులు ఇష్టం లేదని జనాలు భావించారు.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?
జోసెఫ్, నైనిట్ట దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో సమంత అందరి కంటే చిన్నవారు. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఒకరి పేరు జోనాథ్ కాగా, మరొకరి పేరు డేవిడ్. ఇటీవల అమెరికాలో సమంత అన్నయ్య పెళ్లి జరిగింది. దానికి ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యారు. చెన్నైలో జోసెఫ్ అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.
Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?