Top 10 Headlines Today:


వైఎస్సార్సీపీ కొత్త స్ట్రాటజీ


విజయవాడ ఎంపీ స్థానంపై వైఎస్సార్సీపీ కొత్త స్ట్రాటజీ వర్కవుట్ చేస్తోంది. ఎవరూ ఊహించని వర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టబోతోంది. విజయవాడలో గెలవడం కంటే.. ఆ ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం చూపించాలనుకుంటోంది. వైఎస్ జగన్ స్వయంగా తీసుకున్న డెసిషెన్ ఏంటంటే.. ? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అలా అనలేదు


ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. దాంతో తెలంగాణలో రాజకీయ ప్రకంపన మొదదలైంది. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్ మరో సారి స్పందించారు. సోమవారం ఆయన తన వ్యాఖ్యలపై మీడియాకు వివరణ ఇచ్చారు. తాను ఈవీఎం అనలేదని, బటన్ అనలేదన్నారు. ఓ జర్నలిస్ట్ అన్న మాటలకు నువ్వు ఒక్కడివే ఎవరికైనా ఓటేస్తే నేనే గెలుస్తానని అన్నట్లు చెప్పారు. కొందరు తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తున్నారని మంపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కవిత నిజమాబాద్‌లో పోటీ చేస్తే ముడో స్థానంలో ఉంటందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పొడి వాతావరణం


ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ/వాయువ్య  దిశల నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (ఆగస్టు 28) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


స్కూల్స్‌లో ఫోన్లు నిషేధం


ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో సెల్ ఫోన్ల వినియోగంపై సర్కార్ నిషేధం అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


లండన్‌ వెళ్లేందుకు అనుమతి కోరిన జగన్ 


ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన కోసం కోర్టును అనుమతి కోరారు. యూకే పర్యటనకు వెళ్లడం కోసం తెలంగాణ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించాలని జగన్ పిటిషన్‌లో కోరారు. అయితే, జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు కోసం సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్ పై విచారణ ఈనెల 30కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. లండన్ లో ఉంటున్న తన కుమార్తె వద్దకు సెప్టెంబర్ 2న వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రాలేకపోతున్నాం ఏమీ అనుకోవద్దు


భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంశాలపై చర్చించారు. అలాగే ఇరు దేశాలకు చెందిన ఉమ్మడి సమస్యలు, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల జోహన్నెస్‌బర్గ్‌లో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంతో సహా పలు అంశాలపై చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హోండా నుంచి హార్నెట్ 2.0


ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ తన కొత్త 2023 హార్నెట్ 2.0ని భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.39 లక్షలుగా నిర్ణయించారు. కొత్త హార్నెట్‌లో కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లు అందించారు. దీని బీఎస్6 ఇంజన్ ఓబీడీ2 కంప్లైంట్‌గా ఉంది. కొత్త హోండా హార్నెట్ 2.0 మొత్తం నాలుగు రంగులలో లభిస్తుంది. ఇందులో పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఆప్షన్లు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అదిరిపోయే బహుమతి


ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ రన్నర‌ప్ ప్రజ్ఞానంద‌, అతని కుటుంబానికి టెక్ దిగ్గజం ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే బ‌హుమ‌తి ప్రకటించారు. 18 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద‌ విశ్వవేదిక‌పై భారత ఖ్యాతిని చాటాడు. చిన్న వయసులో ప్రపంచ కప్‌కోసం పోరాడిన ఆటగాడిగా అందరి మన్ననలు అందుకున్నారు. ఫిడే వరల్డ్ కప్‌లో జగజ్జేత మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడి రన్నర్‌గా నలిచాడు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానంద‌ కుటుంబానికి ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే బ‌హుమ‌తి అందివ్వనున్నారు. కొత్త ఎల‌క్ట్రిక్ కారును  ప్రజ్ఞానంద‌ కుటుంబానికి అందించనున్నారు. ఈ విష‌యాన్ని ఆనంద్ మ‌హీంద్ర స్వయంగా సోష‌ల్ మీడియాలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


'సెల్యులాయిడ్ సైంటిస్ట్' గా 'కింగ్' నాగార్జున


అక్కినేని నట వారసుడిగా ఆరంగ్రేటం చేసిన 'కింగ్' నాగార్జున.. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలు, విలక్షమైన పాత్రల్లో నటిస్తూ 'ట్రెండ్ సెట్టర్' గా నిలిచారు. ఒకే రకమైన ఇమేజ్ కు పరిమితం అవ్వకుండా, ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్ 'పాత్ బ్రేకర్' అనిపించుకున్నారు. స్టార్ డైరెక్టర్స్ వెంట పరుగులు తీయకుండా, ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ 'సెల్యులాయిడ్ సైంటిస్ట్' గా కొనియాడబడుతున్నారు. గత ఓవైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు బుల్లితెరపై సత్తా చాటారు. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా, బిజినెస్ మ్యాన్ గా, టీవీ హోస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈరోజుతో 64 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. నాగ్ బర్త్ డే సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం! పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ప్రాథమిక కీ విడుదల 


ఏపీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక 'కీ'ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆగస్టు 28న విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌, శాంపిల్‌ టేకర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల కీలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి