ఏపీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక 'కీ'ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆగస్టు 28న విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌, శాంపిల్‌ టేకర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల కీలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 


ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఆగస్టు 29 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయవచ్చు. ఆన్సర్ కీలతోపాలు అభ్యర్థుల రెస్పాన్ షీట్లను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ''View Response Sheets'' టాబ్‌మీ క్లిక్ చేసి లాగిన్ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లను పొందవచ్చు.


ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


TSPSC: గ్రూప్‌-4 ప్రిలిమినరీ కీ విడుదల, టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు
తెలంగాణలో 'గ్రూప్‌-4' ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ సోమవారం (ఆగస్టు 28) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ను కూడా వెబ్‌సైట్‌లో కమిషన్‌ అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్‌ 27 వరకు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌లో 875 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌ లిమిటెడ్ డబ్ల్యూసీఎల్‌కి చెందిన వివిధ ప్రాంతాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 875 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో 62 అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టులు
FDDI Recruitment: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ) అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, గ్రాడ్యుయేషన్‌, బీకామ్‌, బీఏ, బ్యాచిలర్స్‌డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..