Morning Top News:


హైడ్రా, మూసి అంశాలపై రేవంత్  తగ్గారా ? 


హైడ్రా, మూసీ ప్రాజెక్టులకు చట్ట, న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. అయితే అనూహ్యంగా రేవంత్ స్లో అయ్యారు. తొక్కుకుంటూ వెళ్తామని చెబుతున్నారు కానీ.. ఆ అంశాల్లో చిన్న కదలిక కూడా లేదు. ఈ రెండు ఇష్యూలను సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్న కారణంగా రేవంత్ పక్కన పెట్టేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు


నిర్మల్​ జిల్లా దిలావర్ పూర్​ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ  వివాదంలో ప్రథమ ముద్దాయి బీఆర్‌ఎస్ పార్టీయే అంటోంది కాంగ్రెస్. దీనికి పూర్తి అనుమతులు ఇచ్చింది కేసీఆర్ సర్కారేనంటూ విమర్శించింది. అంతే కాకుండా ఇంకో బాంబు కూడా పేల్చారు కాంగ్రెస్ నేతలు. ఈ ఇథనాల్‌ ఫ్యాక్టరీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానిదనంటూ ఆరోపించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


కాంగ్రెస్  ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?


తాము వైసీపీ కంటే చాలా మెరుగు అని నిరూపించేందుకు రోజు రోజుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రకరకాల సమస్యలతో వైసీపీ వెనుకబడిపోతూండగా.. ప్రజాసమస్యలతో పాటు రాజకీయ అంశాల్లో షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ అధికార కూటమిని ఢీ కొడుతున్న ఏకైక నాయకురాలిగా కనిపిస్తున్నారు. అటు జగన్ తో పాటు ఏపీ ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


బాంబు పేల్చిన భట్టి విక్రమార్క


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాంబు పేల్చారు. గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీరును తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


రఘురామ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు


రఘురామకు కస్టడీలో వేధింపుల కేసులో అరెస్టైన సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రఘురామను పోలీస్ కస్టడీలో విపరీతంగా కొట్టారని, ఆయనను లాకప్‌లో చంపడానికి కుట్ర జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


కాకినాడలో కంటైనర్లు సీజ్, సముద్రంలో ఛేజింగ్


సముద్ర మార్గంలో షిప్ ద్వారా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను కాకినాడ జిల్లా కలెక్టర్ అడ్డుకున్నారు. సింగం సినిమా తరహాలో పోలీసులతో కలిసి పడవలో వెళ్లి మరీ అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


అద్దె ఇంటి కోసం వచ్చి హత్య 


నేరాలు చేయాలని అనుకునేవాళ్లు  డబ్బు, బంగారం, తమకు కావాల్సిన దాని కోసం ఎంతకైనా  తెగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంటికి అద్దె కోసం వచ్చిన ముగ్గురు మహిళలు ఇల్లు ఒకే చేసి కొంత అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. రెండవసారి వచ్చి పరిచయం పెంచుకున్నారు. తరువాత మూడవసారి వచ్చిన నిందితులు ఓనర్ దంపతులను దారుణంగా హత్య చేశారు. నేలకొండపల్లిలో జరిగిన ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సీక్రెట్ సరోగసికి వచ్చిన మహిళ మృతి


హైదరాబాద్‌లో అత్యంత లగ్జరీ ఆపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో ఒకటి అయిన మైహోభూజాలో ఓ మహిళ తొమ్మిదో అంతస్తు నుంచి పడి చనిపోయింది.  ఆమె ఆత్మహత్య చేసుకున్నారా.. లేకపోతే ఎవరైనా తోసేశారా..లేకపోతే పారిపోవడానికి ప్రయత్నించి కిందపడి చనిపోయారా అన్నది పోలీసులకు సస్పెన్స్ గా మారింది. అంతకు మించి ఆమె ఆ ఇంట్లోకి సరోగసి ద్వారా బిడ్డను కనిపెట్టడానికి వచ్చినట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


తెలంగాణలో అదానీతో ఒప్పందాల వివరాలివే   


బీఆర్ఎస్ హయాంలో అదానీకి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారని అదే తేడా అని కేటీఆర్ ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని .. పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేశారని అంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


ఐపీఎల్‌కు సెలక్ట్ అయిన సిక్కోలు కుర్రాడు


టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్ కు సెలెక్ట్ అయ్యాడు.  తెలుగు రాష్ట్రాల నుంచి ఐపీఎల్ కు ఎంపికైన అతికొద్ది మందిలో విజయ్ ఒకడు. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు సైతం విజయ్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


తుపానుగా మారిన ఫెంగల్‌ 


నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఫెంగల్... తుపానుగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.  రాయలసీమపై కూడా ప్రభావం కనిపిస్తోంది. కోస్తాలో మబ్బులు పట్టాయి. చెన్నైలో జోరు వానలు పడుతున్నాయి. తీరంట దాటే సమయంలో వర్షాల తీవ్రత పెరగనుంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..