Mayhome Bhuja Women Death: హైదరాబాద్‌లో అత్యంత లగ్జరీ ఆపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో ఒకటి అయిన మైహోభూజాలో ఓ మహిళ తొమ్మిదో అంతస్తు నుంచి పడి చనిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించి విచారణ ప్రారంభించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా.. లేకపోతే ఎవరైనా తోసేశారా..లేకపోతే పారిపోవడానికి ప్రయత్నించి కిందపడి చనిపోయారా అన్నది పోలీసులకు సస్పెన్స్ గా మారింది. అంతకు మించి ఆమె ఆ ఇంట్లోకి సరోగసి ద్వారా బిడ్డను కనిపెట్టడానికి వచ్చినట్లుగా గుర్తించారు.
పిల్లలు లేని దంపతులకు బిడ్డను కనిపెట్టడానికి వచ్చిన మహిళ
మైహోమ్ భూజాలో తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడిన మహిళ ఎవరు అన్నదానిపై పోలీసులు ఆరా తీశారు. ఏ ఫ్లాట్ నుంచి పడిందో ఆ ప్లాట్‌లో ఉండే కుటుంబసభ్యురాలు కాదు. ఆ ఫ్లాట్‌లో ఉండేవారికి పిల్లలు లేరు. వారికి సరోగసి ద్వారా పిల్లలను పుట్టించి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని ఆమె ఆ ఇంటికి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.రూ. పది లక్షలకు డీల్ మాట్లాడుకుని భార్య, భర్త ఇద్దరూ వచ్చి ఆ ఇంట్లో ఉంటున్నారు. డాక్టర్ ట్రీట్మెంట్ ప్రక్రియ నడుస్తోంది. ఇంకా ఐవీఎప్ ప్రక్రియ చేయలేదని తెలుస్తోంది.
Also Read: వీడేం మొగడండి బాబూ - వీసా తెచ్చుకుని ఆస్ట్రేలియా తీసుకెళ్లలేదని వదిలేశాడట !
పారిపోవడానికి ప్రయత్నించిన మహిళ
మహిళ చనిపోయిన భవనం తొమ్మిదో అందస్తులో .. రెయిలింగ్‌కు చీరలు కట్టి ఉన్నాయి. ఆ చీరల ద్వారా ఆమె కిందకు దిగేందుకు ప్రయత్నించారని పట్టు తప్పి కింద పడిపోవడం వల్ల చనిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఎందుకు పారిపోవాలనుకున్నారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె భర్త కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. సరోగసి ప్రాసెస్ కోసమే వచ్చామని అయితే ఇంటి యజమానికి అసభ్యంగా ప్రవర్తిస్తూండటంతో తన భార్య పారిపోవాలనుకుందని కానీ.. పట్టు తప్పి పడి చనిపోయిందని ఆమె భార్య పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read: జీపీఎస్ తప్పిదంతో ప్రమాదం - నిర్మాణంలో వంతెనపై నుంచి పడిన కారు, ముగ్గురు మృతి
సరోగసిపై ఆంక్షలు
భారత్‌లో సరోగసిపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. అయితే కొన్ని ఆస్పత్రులు మాత్రం మహిళలతో సీక్రెట్ గా ఒప్పందాలు చేస్తున్నాయి. ఇలా పిల్లలు పుట్టే అవకాశం లేని దంపతులకు సరోగసికి ఒప్పందం చేయించారని కానీ ఆ మహిళ పారిపోవడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ మహిళతో ఒప్పందం చేసుకున్న జంటపై కేసులు పెడతారో లేదో స్పష్టత లేదు. అత్యంత లగ్జరీ అపార్టుమెంట్లో అందరూ పలుకుబడి ఉన్నవారే ఉంటారు కాబట్టి.. కేసు క్లోజ్ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.