Ponnur man Left his wife For getting an Australian visa: ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తూ.. పెళ్లి చేసుకుని భార్యను ఆ దేశానికి తీసుకెళ్తారు. కానీ కొందరుంటారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి  చేసుకోవాలని అనుకుంటారు. అప్పుడు హాయిగా ఆస్ట్రేలియా వెళ్లిపోవచ్చని ప్లాన్. అయితే ఈ రోజుల్లో ఎవరైనా ఇండియాలో కూడా ఉద్యోగం లేని వాడికి ఆస్ట్రేలియాలో చదివే అమ్మాయి సంబంధం వస్తుందా.. చాన్సే లేదు. అందుకే పొన్నూరుకు చెందిన మౌలా బాబు అనే వ్యక్తి ప్రత్యేకంగా ఆలోచించాడు. అదేమిటంటే తన కంటే బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకు ఆస్ట్రేలియా వీసా వచ్చేలా సహకరించి.. తర్వాత ఆమె ద్వారి డిపెండెంట్ వీసా ద్వారా అస్ట్రేలియా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అంతా అనుకున్నట్లుగా జరిగింది కానీ వీసా మాత్రం భార్యకు రాలేదు. అక్కడే అసలు ట్విస్ట్ ప్రారంభమయింది. 


మౌలాబాబు అనే వ్యక్తి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం అరెమండ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అస్ట్రేలియాలో సెటిలైపోవాలని ఆయన కోరిక. కానీ తన వల్ల కాలేదు. బాబు టాలెంట్ కు వీసా పలుమార్లు రిజక్ట్ అయింది. భార్యను ఆస్ట్రేలియా పంపి డిపెండెట్ క్రింద తాను  వెళ్ళవచ్చని ప్లాన్ వేశాడు. అ ప్లాన్‌తో  రెండేళ్ళ క్రితం కట్టెంపూడికి చెందిన మౌళికను పెళ్లి చేసుకున్నాడు. తన కోరికను ముందుగానే చెప్పాడు. మౌళిక కూడా తన భర్త కోరిక తీర్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. మౌళిక ఎంబీఏ చేసి.. ఆస్ట్రేలియా వీసా కోసం గట్టిగా ప్రయత్నించంది.  మౌళిక కకు రెండు సార్లు స్కోర్ తక్కువగా రావడంతో వీసా రాలేదు. ఇక వీసా రాదని .. తనను ఆస్ట్రేలియా తీసుకెళ్లే భార్య కాదని చెప్పి ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేసారు. 


Also Read: జీపీఎస్ తప్పిదంతో ప్రమాదం - నిర్మాణంలో వంతెనపై నుంచి పడిన కారు, ముగ్గురు మృతి


మరో ప్రయత్నం చేస్తున్న మౌళిక  మూడవ సారి స్కోర్ బాగ వచ్చింది మరో సంవత్సరంలో వీసా మంజూరు అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. కుమార్తె జీవితం నాశనం అయిపోతుందని ..  మౌలా బాబు అతని తల్లి..ఎంత బతిమలాడిన కనిక రించ లేదు..ఇక చేసేది లేక ఆదివారం  నుంచి ఇంటి ముందు  నిరసనకు దిగింది మౌళిక. అమ్మాయి పరిస్తితి తెలుసుకొని గ్రామంలో మహిళలు మద్దత్తుగా నిలచారు.                            


ఆస్ట్రేలియాకు వెళ్లడానికి భార్యను వీసాగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసిన మౌలాబాబు, అతని తల్లి నిర్వాకంపై పోలీసులకు కూడా సమాచారం వెళ్లడంతో  ఇంటికి తాళాలు వేసుకొని పరారైనారు మౌలా అతని తల్లి...తానకు న్యాయం జరిగేదాక ఆందోళన విరమించనని చెబుతోంది  బాధిత మహిళ  మౌళిక. భర్త ఇంటిముందే ఆందోళన చేస్తున్న మౌళికకు మహిళలు మద్దత్తుగా నిలచారు.. 



Also Read: US Stundents : అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !