Adani In Telangana:  బీఆర్ఎస్ హయాంలో అదానీకి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారని అదే తేడా అని కేటీఆర్ ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని .. పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేశారని అంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 


Also Read:  తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?


విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం                       
 
2020-21లో యాదాద్రిలో పరమపూజ్య సోలార్ ఎనర్జీ పేరుతో ప్లాంట్ పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఇరవై ఐదు మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్ను రూ. 746 కోట్లు పెట్టుబడిగా ప్రభుత్వమే ప్రకటించింది. తర్వాత అదే కంపెనీతో వంద మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది. ఈ కంపెనీ అదానీ సబ్సిడరీ.  అదే సమయంలో అదానీకి గ్రూపు కంపెనీ అయిన ఆర్‌ఈజీఎల్ తో 110 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ వివరాలను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. 




బీఆర్ఎస్ హయాంలో పలు రకాల పెట్టుబడులు             


బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అదానీ పలు రకాల పెట్టుబడులు పెట్టారు. మామిడిపల్లిలో అదానీ ఎల్బిట్ సిస్టమ్స్, మామిడిపల్లిలో మిస్సైల్ సెల్ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్, కౌంటర్ డ్రోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, ముచ్చెర్లలో డాటా సెంటర్ కాంప్లెక్స్ ఇచ్చారన్నారు. అదానీకి చెందిన ఏరోస్పేస్ పార్క్ ను శంషాబాద్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ పార్క్ కోసం యూఏవీ ఫెసిలిటీ కల్పించారు. దీని వల్ల అదానీ ఏరో స్పేస్ పార్క్‌కు అదనపు ప్రయోజనాలు లభిస్తాయిని అంటున్నారు.


పలు రకాల కాంట్రాక్టులు కూడా !                                      


అదానీ పలు రకాల ప్రాజెక్టులు కూడా  బీఆర్ఎస్ హయాంలో చేపట్టింది. మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులను అదాని గ్రూపు కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఐదు వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ హయాంలోనే ప్రతిపాదనలు అందాయని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అదానీ పెట్టుబడులు న్యాయబద్దంగా ఉంటే తెలంగాణకు మేలేనని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.   అదానీకి పెట్టుబడుల వల్ల తెలంగాణకు మేలే జరుగుతుంది. అందులో అవినీతి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందేనని.. కానీ న్యాయబద్దంగా టెండర్లలో దక్కించుకున్న వాటిని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.                         


 


Also Read: Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?