Weather In Hyderabad Telangana And Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఫెంగల్... తుపానుగా మారింది. ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 100 కి.మీ, నాగపట్టణానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 490 కి.మీ.ల దూరంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఉంది. నవంబర్ 30 నాటికి కారైకాల్, మహాబలిపురం మధ్య ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. 

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమపై కూడా ప్రభావం కనిపిస్తోంది. కోస్తాలో మబ్బులు పట్టాయి. చెన్నైలో జోరు వానలు పడుతున్నాయి. తీరంట దాటే సమయంలో వర్షాల తీవ్రత పెరగనుంది. గాలులు గంటకు 50-60 Kmph వేగంతో వీస్తాయి. నవంబర్ 29 వరకు సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. 

వర్షాలు పడే ప్రాంతాలు 

28.11.2024: నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అ జిల్లాల్లో జోరు వానలు పడతాయని అధికారులు చెబుతున్నారు మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపారు. 

29.11.2024:- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడతాయి. గోదావరి జిల్లాలు, యానాం, విశాఖ మినహా ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన లేదని వివరించారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురులు వర్షాలు పడతాయి. 

30.11.2024: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ఈజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

అక్కడక్కడ వర్షాలు పడే ప్రాంతాలు(ఎల్లో అలర్ట్):- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, యానాం, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, 

వర్షాలు పడే అవకాశం లేని ప్రాంతాలు(గ్రీన్ అలర్ట్‌):- పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, 

01.12.2024:- రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వర్షాలు లేవు 

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలు(Temperature In Andhra Pradesh District Wise)
 
  ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) తేమ  శాతం
1
కళింగపట్నం 
28.9 16.2 71
2
విశాఖపట్నం 
29.4   22.9  51
3
తుని 
31.7   19.8    72
4
కాకినాడ 
29.8   22.2   66
5
నర్సాపురం
31   21   63
6
మచిలీపట్నం 
31   21.7   71
7
నందిగామ 
30.8   18.2    81
8
గన్నవరం 
30.2   21.2   63
9
అమరావతి 
31.2   21.2   66
10
జంగమేశ్వరపురం 
30.8   18   89
11
బాపట్ల 
29   19.7   79
12
ఒంగోలు 
28.7   22.8   71
13
కావలి 
28.4   23.2   81
14
నెల్లూరు 
24.4    22.6   95
15
నంద్యాల 
29   19.8   86
16
కర్నూలు 
32   20.2   80
17
కడప 
28.4    20.6   91
18
అనంతపురం 
27.1   18.7   96
19
ఆరోగ్యవరం 
24    18.5   89
20
తిరుపతి 
24.4   20.5   78

తెలంగాణలో వాతావరణం (Telangana Weather): తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలుగా నమోదు అయింది. సాధారణం ఉష్ణోగ్రత 1.6 నుంచి 3 డిగ్రీల మధ్య తగ్గిన ప్రాంతాలు దుండిగల్, నిజామాబాద్, రామగుండం, పటాన్‌చెరు, సాధారణ ఉష్ణోగ్రత 3 నుంచి ఐదు డిగ్రీల మధ్య పడిపోయిన ప్రాంతాలు హన్మకొండ, మెదక్, సాధారణ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల కంటే ఎక్కువ పడిపోయిన ప్రాంతం ఆదిలాబాద్. ఈ ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు చొప్పున తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్‌లో వాతావరణం (Weather Update Hyderabad)

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29°C, 16°C ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు తూర్పు/ఈశాన్య దిశలో గంటకు 04-08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
నమోదైన వాతావరణం: గరిష్ట ఉష్ణోగ్రత: 28.5°C కనిష్ట ఉష్ణోగ్రత: 15.5°C

వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. (Temperature In Telangana District Wise)
 
  ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) తేమ  శాతం
1 ఆదిలాబాద్‌  28.8  9.7 76
2 భద్రాచలం  30.6 18.0  89
3 హకీంపేట  28.8     14.7  58
4
దుండిగల్ 
30.1   14.9   60
5
హన్మకొండ  
30.0  14.0    90
6
హైదరాబాద్  
29.8   15.5    60
7
ఖమ్మం 
31.6   18.4    84
8
మహబూబ్‌నగర్  
31.0     19.5     58
9
మెదక్ 
29.8  10.8   63
10
నల్గొండ 
28.0  17.8   74
11
నిజామాబాద్ 
31.1   14.0   83
12
రామగుండం 
29.2   13.8   87
13
పటాన్‌చెరు 
29.4   11   91
14
రాజేంద్రనగర్ 
29.5   13   84
15
హయత్‌నగర్ 
29.0  13.8    92

Also Read: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్