December Monthly Horoscope 2024


మేష రాశి


మేషరాశి వారికి  డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.  ఉద్యోగాలలో కొత్త అవకాశాలను పొందుతారు. సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా బలపడతారు. వైవాహిక జీవితంలో చిన్నపాటి వివాదాలుంటాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  


వృషభ రాశి


ఈ నెల ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం మెరుగ్గా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కొన్ని వ్యవహారాలు మధ్యలోనే నిలిచిపోతాయి. అకారణ వివాదాలు, ప్రయాణాల్లో సమస్యలు తప్పవు.


మిథున రాశి


డిసెంబర్ నెల ప్రధమార్థం మిథున రాశివారికి సమస్యలు తప్పవు. ఆదాయాన్ని మించిన ఖర్చులు తగ్గించడం మంచిది. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. అయితే ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి. స్నేహితులతో మంచి టైమ్ స్పెండ్ చేస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి.


Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!


కర్కాటక రాశి


కర్కాటక రాశివారికి డిసెంబరు నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి వస్తాయి కానీ ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఉన్నా తొలగిపోతాయి. ఉద్యోగంలో మెరుగుదల ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది.


సింహ రాశి


డిసెంబర్ నెల మీకు శుభాశుభాలు సమానంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాద సూచన 


కన్యా రాశి 


ఈ నెల కన్యారాశివారికి బాగానే ఉంటుంది.  వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగంలో సీనియర్ అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 


Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!


తులా రాశి 
 
డిసెంబర్ నెల తులా రాశివారికి సవాలుగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలతో సమస్యలను అధిగమిస్తారు. నూతన వ్యవహారం లాభం ఉంటుంది.  కష్టానికి తగిన ఫలితం పొందుతారు.  ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న వివాదాలు సమసిపోతాయి.


వృశ్చిక రాశి
 
వృశ్చిక రాశి వారికి ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. అనుకూల గ్రహసంచారం వల్ల చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రానిబాకీలు వసూలవుతాయి. వాహన మార్పులు..గృహాల కొనుగోలు ప్రయత్నాలు సఫలం అవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 


ధనుస్సు రాశి 


ఈ నెల మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకోని ఆస్తులు కలిసొస్తాయి


మకర రాశి


డిసెంబర్ మకర రాశివారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.  చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రతి చిన్న విషయానికి కోప్పడటం తగ్గించుకోవాలి. మీ మాట కటువుగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు తప్పవు. అనుకోని ఖర్చులు ఇబ్బందిపెడతాయి. ఉద్యోగులు పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు


కుంభ రాశి


ఈ రాశివారు డిసెంబరులో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతతని ఇస్తుంది. చేపట్టిన పనుల్లో కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.  ఆరోగ్యం బాగానే ఉంటుంది.  


మీన రాశి


గ్రహాల అనుకూల సంచారం వల్ల డిసెంబరు నెలలో మీన రాశివారికి శుభఫలితాలున్నాయి. నూతన వ్యాపారం, ఉద్యోగం ప్రారంభించేందుకు మంచి సమయం. ఎంతో కాలంగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్నింటా మీ మాటే నెగ్గుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు..


Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


ABP దేశంలో మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి