Revanth was slow on HYDRA and MUSI issues: తెలంగాణ  ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో రేవంత్ ప్రారంభించిన రెండు ముఖ్యమైన పనులు హైడ్రా ద్వారా చెరువుల పునరుజ్జీవం, మూసి ప్రక్షాళన. ఈ రెండింటిని ఎంత దూకుడుగా ప్రారంభించారో అంతే దూకుడుగా స్లో చేశారు. బహిరంగసభల్లో ఆపేదే లేదు అని చెబుతున్నారు కానీ.. ఆగినవి మళ్లీ ప్రారంభమయ్యే సూచనలే కనిపించడం లేదు. ఈ రెండు ఇష్యూలను సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్న కారణంగా రేవంత్ పక్కన పెట్టేశారన్న అభిప్రాయం ఈ కారణంగా వినిపిస్తోంది. 


టూర్లతో టైం పాస్ చేస్తున్న హైడ్రా రంగనాథ్


హైడ్రా అనే కొత్త వ్యవస్థను పెట్టాలని కేబినెట్‌లో నిర్ణయించిన మరుక్షణం..సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు. నాలుగు బుల్డోజర్లు కేటాయించారు. అంతే ఆయన పని ప్రారంభించారు. మొదట్లోఆయన పెద్ద ఫామ్ హౌస్‌లను భయపడకుండా కూల్చేయడంతో అందరూ ఆహా ఓహో ఆన్నారు. అన్ని జిల్లాలకూ కావాలన్నారు.తర్వాత పక్క రాష్ట్రాలు కూడా కావాలన్నాయి. తర్వాత ఏ ముహుర్తాన ముందూ వెనుకా చూడకుండా అమీన్ పూర్‌లో ఇళ్లను కూలగొట్టారో అప్పుడే వ్యతిరేకత వచ్చింది. అది ప్రభుత్వ భూమే కావొచ్చు కానీ.. అన్ని రకాల ప్రభుత్వ శాఖలు అనుమతి ఇచ్చిన తర్వాత కూల్చడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది. దానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అదే సమయంలో చట్టబద్దతపై వచ్చిన సందేహాలకు సమాధానాల్లేవు. అంతే హైడ్రాపై ప్రజల్లో ఒక్క సారిగా భయం పుట్టేలా ప్రచారం  జరిగింది. హైదరాబాద్ లో సగం కూల్చేశారని చెప్పుకునేలా చేశారు. దాంతో అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడుడ హైడ్రాకు చట్టబద్దత వచ్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కానీ హైడ్రా కమిషనర్ మాత్రం చెరువులను పరిశీలిస్తూ టైం పాస్ చేస్తున్నారు. 


Also Read: Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?


మూసి ప్రక్షాళనకూ తొలగిన ఆటంకాలు 


మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి చేపట్టిన కీలక ప్రాజెక్టుల్లో ఒకటి.  మూనీనదికి రెండువైపులా నివాసాలు ఉంటున్న వారిని అక్కడినుండి తరలించి పునరుజ్జీవన ప్రాజెక్టును మొదలుపెట్టాలని రేవంత్ ప్లాన్ చేసుకున్నారు. అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలనుకున్నారు.  కొందరు కోర్టులో కేసు వేశారు. మరుతీనగర్ వాసులు వందమంది దాకా కోర్టుకెక్కారు. మొదట్లో ప్రభుత్వ చర్యలపై స్టే ఇచ్చిన హైకోర్టు తాజాగా తుది తీర్పులో తీర్పులో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమణదారులుగా తేలితే వెంటనే ఇళ్ళను కొట్టేయచ్చని  బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల కోసం అధికారులు చేపట్టే సర్వేను పిటీషనర్లు, ఆక్రమణదారులు అడ్డుకోకూడదని స్పష్టంగా చెప్పారు. దీంతో  రేవంత్ ప్రభుత్వానికి న్యాయపరమైన అడ్డంకులు అన్నీ తొలగిపోయినట్లయ్యింది.


Also Read: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?


మూసి, హైడ్రా విషయాల్లో రేవంత్ ముందు అనే సవాళ్లు 


మూసిని ప్రక్షాళన చేయకపోతే.. హైదరాబాద్ చెరువుల్ని పునరుజ్జీవం చేయకపోతే తన జీవితం వృధా అని రేవంత్ ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఏడాది కాలంలో ఆయన వేసిన ముందడుగులు చేలా పరిమితం. మూసి ప్రక్షాళనకు ఇంత వరకూ డీపీఆర్ రాలేదు. నిధులసేకరణ ఎలా చేస్తారో స్పష్టత లేదు. హైడ్రా విషయంలో వచ్చిన ప్రజావ్యతిరేకత, రియల్ ఎస్టేట్ స్లో కావడం వంటి పరిణామాలతో హైడ్రా భయాన్ని తగ్గించడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సమయంలో.. ఈ రెండు రేవంత్ రెడ్డి చాలెంజింగ్ గా తీసుకున్న వాటిని ఎంత మేర ముందుకు తీసుకెళ్తారో ముందు ముందు చూడాల్సి ఉంది.