Top 10 Headlines Today: 


పవన్ లాజిక్ అదేనా?


జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. మామూలుగా తన యాత్రను ఆయన తిరుపతి నుంచి ప్రారంభించాలి. కానీ పొత్తుల చర్చలు..ఇతర రాజకీయ పరిణామాలు... ముందస్తు ఎన్ని  ఇతర  కారణాలన్నింటినీ లెక్కలేసుకుని ఉభయగోదావరి జిల్లాల్లోనే వారాహియాత్ర మొదటగా చేయాలని నిర్ణయించుకున్నారు. అన్నవరం దగ్గర నుంచి ప్రారంభించి నర్సాపురం వరకూ వచ్చారు. ప్రతీ చోటా ఆయన చెబుతున్న మాట ఒక్కటే. ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదని. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాట కాదని.. ఇందులో జగన్ కు అధికారాన్ని దూరం చేసే లోతైన వ్యూహం ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కేసీఆర్ టార్గెట్ ఏంటీ?


తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత కేసీఆర్ వేరే ఏ రాష్ట్రంలోనూ పర్యటించలేదు..ఒక్క మహారాష్ట్రలో తప్ప. పదే పదే మహారాష్ట్రకు వెళ్తున్నారు. నాగపూర్ లో ఆఫీసు కూడా ప్రారంభించారు. ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి తాను కూడా స్వయంగా వెళ్లారు. ఏపీలో ఆఫీసు ప్రారంభోత్సవానికి కనీసం పార్టీ ప్రతినిధిని కూడా పంపలేదు. కేసీఆర్ మహారాష్ట్రపై ఇంత గరి పెట్టడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


16 రాష్ట్రాలకే మూలధన పెట్టుబడి


గత కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రత్యేక సహాయ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 16 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మూలధన పెట్టుబడిని ప్రకటించింది. ఈ మొత్తం రూ.56,415 కోట్లు. మూలధన పెట్టుబడి ప్రతిపాదనలకు నేడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో, రాష్ట్ర స్థాయిలో మూలధన వ్యయాన్ని ప్రోత్సహించడానికి, ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ ప్రకటించారు. ఈ పథకం కింద, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణం రూపంలో రాష్ట్రాలకు రూ.1.3 లక్షల కోట్ల వరకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రూ.56,415 కోట్లు విడుదల చేస్తున్నారు. కొవిడ్‌ అనంతరం అన్ని రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా  లింబ్రాదిని


తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌. లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ జూన్ 26న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా ఎస్‌కే మహమూద్‌ను నియామకమయ్యారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అది ఒక్కటే మార్గం 


ఇటీవల అలిపిరి నడక దారిలో చిన్నారిపై చిరుత దాడి దురదృష్టకర ఘటన అని ప్రిన్సిపల్ చీఫ్ అటవీ సంరక్షణ అధికారి మధుసూదనా రెడ్డి అన్నారు. నడక దారికి ఇరువైపుల కంచె నిర్మాణం సాధ్యం కాదని, చీకటి పడ్డాక భక్తులు కొండపైకి గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. సోమవారం తిరుపతిలోని ఎర్రచందనం గోడౌన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అలిపిరి నడక మార్గంలో చీకటి పడ్డాక గుంపులుగా వెళ్ళాలని భక్తులకు సూచించారు. చిరుత అధికంగా సంచరించే ప్రదేశాల్లో మరిన్ని కెమెరా ట్రాప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంకా తల్లి చిరుత సంచరిస్తోంది అనడానికి ఆనవాళ్లు లేదని, చిరుత ఇక్కడ సాధారణంగా మనుషులపై దాడి చేయలేదని, చాలా అరుదుగానే ఈ ఘటన జరిగిందన్నారు. నడక దారిని శుభ్రంగా ఉంచాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


దూర ప్రాంత ప్రయాణికులకు గుడ్ న్యూస్


ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల విషయంలో ముందస్తు రిజర్వేషన్లు చేసుకుంటే విధించే ఛార్జీలను తగ్గించనుంది. ఇప్పటికి ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ బస్సు సర్వీసుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ ఛార్జీల‌ను వసూలు చేస్తున్నారు. ఆ ఛార్జీలు ఇకపై తగ్గనున్నాయి. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలో మీట‌ర్ల లోపు రూ.20, 350 పైబడి కిలో మీటర్లు ఉంటే రూ.30 అదనపు ఛార్జీని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా


ప్రపంచంలో ప్రతీ ఏటా అత్యధిక సినిమాలు రిలీజ్ అవుతున్న దేశం ఇండియా అంటే మీరు నమ్ముతారా. అవును మీరు విన్నది నిజమే.. భారతదేశంలో ప్రతి ఏడాది వివిధ భాషల్లో సుమారు 1,800 సినిమాలు విడుదల అవుతున్నాయట. అలాగే గత దశాబ్ధం నుంచీ కూడా ఇండియన్ సినిమాల మార్కెట్ కూడా బాగా పెరిగింది. అందుకే సినిమా నిర్మాణ విలువలు కూడా పెరుగుతున్నాయి. సినిమా కోసం ఖర్చు పెట్టడానికి నిర్మాతలు కూడా వెనకాడటం లేదు. దీంతో భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. నటీనటుల రెమ్యునరేషన్, కాస్ట్యూమ్ డిజైన్లు, సెట్లు, వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఇటీవల కాలంలో అలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఏంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


విండీస్‌కు ఎదురు దెబ్బ


బహుశా క్రికెట్‌ అతిగా ప్రేమించే వాళ్లు మాత్రమే ఈ అద్భుతమైన మ్యాచ్ చూసి ఉంటారేమో. చాలా మందికి ఇలాంటి మ్యాచ్‌ ఒకటి జరిగి ఉంటుందని కూడా తెలియదు. అవును నెదర్లాండ్, విండీస్ మధ్య అలాంటి మ్యాచ్‌ సోమవారం జరిగింది. ఈజీగా విండీస్‌ గెలిచేస్తుందిలే అనుకున్న మ్యాచ్‌లో మంచి ఫైట్ ఇచ్చి విజయాన్ని నమోదు చేసింది నెదర్లాండ్. అంతే కాదు విండీస్‌ క్రికెట్‌ కెరీర్‌నే ప్రమాదంలో పడేసింది. క్రికెట్‌లో ఎప్పుడైనా అద్భతం జరగొచ్చు అని చెప్పేందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు ఈ మ్యాచ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మేలో అత్యధికంగా అమ్ముడు పోయిన ఎస్‌యూవీలు ఇవే


గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశ ప్రజలు ఎస్‌యూవీ కార్లను చాలా ఇష్టపడటం ప్రారంభించారు. దీంతో ఈ కార్ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు సాయపడింది. గత నెలలో కూడా ఎస్‌యూవీల విభాగంలో భారీగా విక్రయాలు జరిగాయి. 2023 మే నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాను చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రెండు రోజుల పాటు వర్షాలు 


ఈ రోజు అల్పపీడనం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, పరిసరాలలోని దక్షిణ జార్ఖండ్ & ఉత్తర ఛత్తీస్ గఢ్ వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనము సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి