ఈ రోజు అల్పపీడనం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, పరిసరాలలోని దక్షిణ జార్ఖండ్ & ఉత్తర ఛత్తీస్ గఢ్ వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనము సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని చెప్పారు. 


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు  ఈ రోజు, రేపు కొన్ని చోట్ల ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో  కూడిన  వర్షములు  ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.  ఈ రోజు భారీ వర్షాలు  రాష్ట్రంలో ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ  వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 80 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.


తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.


రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


‘‘అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతం నుంచి భూభాగానికి వెళ్లడం వలన నేడు ఒడిషా రాష్ట్రంతో పాటుగా మధ్యప్రదేశ్ వైపుగా వర్షాలుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నేడు అక్కడక్కడ మాత్రమే (తక్కువ చోట్లల్లో మాత్రమే) నేడు, రేపు వర్షాలను చూడగలము. ముఖ్యంగా సాయంకాలం రాత్రి సమయాల్లో దక్షిణ కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లాల్లో కొద్ది సేపు భారీ వర్షాలు నేడు మనకు ఉంటుంది. మిగిలిన భాగాల్లో తక్కువగానే వర్షాలుంటాయి. అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలము.


ఈ జూన్ నెల మనకు భారీ లోటుతో ముగియనున్నది. ఎందుకంటే మొదటి మూడు వారాలుగా మనకు తక్కువ వర్షాలే చూశాం. ఇప్పుడు కూడా వర్షాలు ఒక 60-70 % ప్రాంతాల్లోనే బాగా పడతాయి. మిగిలిన అన్ని భాగాల్లో అంతగా వర్షాలు లేవు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.