తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌. లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ జూన్ 26న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా ఎస్‌కే మహమూద్‌ను నియామకమయ్యారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.


లింబాద్రి స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామం. దళిత కుటుంబంలో పుట్టిన ఆయన విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో పనిచేశాడు. వివాదరహితుడిగా పేరున్న ఆయన ఆర్మూర్‌ డివిజన్‌లో రైతు కూలీ సంఘంలో పనిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, పీహెచ్డీ పట్టా పొందిన ఆయన.. సికింద్రాబాద్‌ పీజీ కాలేజీకి వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. కొన్నాళ్లు ఉన్నత విద్యామండలి సభ్యుడిగా కొనసాగిన ఆయన.. అనంతరం రెండేళ్ల పాటు ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా పూర్తి స్థాయిలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ALSO READ:


అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్యా విధానంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6న బీఈడీ ఓడీఎల్ ప్రవేశ పరీక్షను ఉదయం 10.30గంటల నుంచి 12.30గంటల వరకు; అలాగే, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, ఫీజు చెల్లింపు గడువు ఇదే! పూర్తి షెడ్యూలు ఇలా!
తెలంగాణలో ఎంసెట్-2023 ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం (జూన్ 26) ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 26 నుంచి జులై 5 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు జూన్ 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇది పూర్తయినవారు అభ్యర్థులు 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఐచ్ఛికాలను (వెబ్ ఆప్షన్లు) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 26 నుంచి జులై 19 మొదటివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial