Discount on New Car: ప్రస్తుతం మనదేశంలో ప్రతి నెలా లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది కూడా. కొత్త కారు కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరతో పాటు వినియోగదారులు చాలా పన్నులు, ఇతర ఛార్జీలు చెల్లించాలి. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే కొంత డబ్బు ఆదా చేసుకోవడానికి అవసరమైన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.


కార్ల తయారీదారులు తమ అనేక మోడళ్లపై తరచుగా వివిధ రకాల ఆఫర్‌లను అందిస్తారు. వీటిని డీలర్‌షిప్‌లో కస్టమర్లకు ఎక్కువగా వెల్లడించరు. అటువంటి పరిస్థితిలో వాహనం కొనుగోలు చేయడానికి ముందు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మీకు ఇష్టమైన కారుపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్‌ను చెక్ చేసుకోండి.


ఇన్సూరెన్స్ కంపెనీని మీరే ఎంచుకోండి
ఏదైనా ప్రముఖ కారు కొనుగోలుపై డీలర్ నుంచి తగ్గింపు పొందడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో మీరు కొంత పొదుపు చేయాలనుకుంటే డీలర్ నుంచి వాహనానికి బీమా తీసుకునే బదులు, అనేక బీమా కంపెనీల ఆఫర్‌లను కంపేర్ చేయడం ద్వారా మీ కోసం ఉత్తమమైన ఆప్షన్‌ను ఎంచుకోవాలి.


డీలర్‌తో బేరం ఆడండి
ఈ పద్ధతి కొంచెం ఇబ్బందికరమైనది. కానీ మీరు దీని ద్వారా భారీ తగ్గింపును పొందవచ్చు. ముందుగా ఒక షోరూమ్‌కి వెళ్లి వాహనం ధర, తగ్గింపు, అన్ని ఇతర వివరాల గురించి సమాచారాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత మరో షోరూమ్‌కి వెళ్లి, మొదటి షోరూమ్‌లో కంటే తక్కువ ధర ఉందా? ఎక్కువ ధర ఉందా? అని కంపేర్ చేయండి. అలా మరిన్ని షోరూమ్‌లకు కూడా వెళ్లండి. ఇలా చేస్తే మీరు డీలర్ నుండి అనేక గొప్ప ఆఫర్లను పొందవచ్చు.


పాత కారుపై ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్
మీ దగ్గర 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనం ఉంటే దానిని స్క్రాప్ చేయడానికి బదులుగా ఒక ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. ఇది కొత్త కారు కొనుగోలుపై మీకు రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తుంది.


మరోవైపు జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు టయోటా సాలిడ్ స్టేట్ బ్యాటరీలతో నడిచే కొత్త ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం)పై పని చేస్తుంది. ఇది దాదాపు 1,200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టనుందట. అంటే కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో మనం 1,200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చన్న మాట.


ఎలాన్ మస్క్ టెస్లా సూపర్ ఛార్జర్ టెక్నాలజీతో 15 నిమిషాల్లో దాదాపు 200 మైళ్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు టయోటా లాంచ్ చేయనున్న ఈ కొత్త బ్యాటరీ మరింత వేగంగా ఛార్జ్ అవుతుంది. టయోటా తన కొత్త టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌లో 2026 నాటికి తన నెక్స్ట్ జనరేషన్ ఈవీ కోసం అధిక పనితీరు గల లిథియం అయాన్ బ్యాటరీని ప్రవేశపెట్టాలని ప్రణాళికల్లో ఉన్నట్లు తెలిపింది.


మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ అవుతుంది. అలాగే సుమారు 1,000 కిలోమీటర్ల (620 మైళ్ళు) రేంజ్‌ను అందిస్తుంది. టయోటా (టయోటా ఫాస్ట్ ఛార్జింగ్ కారు) చెప్పాలంటే తదుపరి తరం బ్యాటరీలు, సోనిక్ టెక్నాలజీని అనుసంధానం చేయడం వంటి సాంకేతికత ద్వారా 1,000 కిలోమీటర్ల వాహన క్రూజింగ్ రేంజ్‌ను అందిస్తారు.









Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!