జూన్ చివరి వారంలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు ఓటీటీలో విడుదల కానున్నాయి. ఈ వీక్ స్ట్రీమింగ్ కు వచ్చే చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా మోతాదుకు మించి అడల్ట్ సీన్లతో నిండిపోయాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏమిటో చూసేయండి.


అమెజాన్‌ ప్రైమ్‌


1. జాక్‌ ర్యాన్‌ (వెబ్‌సిరీస్‌ 4)- జూన్‌ 30న విడుదల


జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి జాన్ క్రాసిన్స్కి నటించిన ‘జాక్ ర్యాన్’ వెబ్ సీరిస్ బాగా నచ్చుతుంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో జాక్ ర్యాన్ సిరీస్ కొనసాగుతోంది. జూన్ 30న ఈ సిరీస్ నాలుగో భాగం స్ట్రీమింగ్ కు రానుంది.     


నెట్‌ఫ్లిక్స్‌


1. టైటాన్స్‌ (వెబ్‌సిరీస్‌, సీజన్ 4): జూన్‌ 25న విడుదల


2. విట్చర్ (వెబ్ సీరిస్, సీజన్-3, వాల్యూమ్ 1): జూన్ 29న విడుదల


3. లస్ట్‌ స్టోరీస్‌ 2 (హిందీ) జూన్‌ 29న విడుదల


బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’.  2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’కు ఇది సీక్వెల్. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ నటిస్తున్నారు. ఈ సిరీస్ కు అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేశాయి. డబుల్ మీనింగ్ డైలాగ్ లు, బోల్డ్ కంటెంట్‌తో ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తూ అర్థమవుతోంది.   



3. సీయూ ఇన్‌మై నైన్టీన్త్‌ లైఫ్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 29న విడుదల


4. అఫ్వా (హిందీ) జూన్‌30న విడుదల


5. సెలెబ్రిటీ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 30న విడుదల


డిస్నీ+హాట్‌స్టార్‌


1. వీకెండ్‌ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 28న విడుదల


2. ది నైట్‌ మేనేజర్‌ (సిరీస్‌2) జూన్‌30న విడుదల


బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌, శోభిత ధూళిపాళ్ల, తిలోత్తమ షోమ్‌, అరిస్టా మెహతా ప్రధాన పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’. ఈ ఏడాది ఫిబ్రవరిలో‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలై  ప్రేక్షకులను బాగా అలరించింది. అదే ఓటీటీలో ఇప్పుడు పార్ట్ 2 విడుదలకు రెడీ అయ్యింది. జూన్‌ 30 నుంచి ‘ది నైట్‌ మేనేజర్‌ 2’స్ట్రీమింగ్‌కు రానుంది. 


బుక్‌ మై షో


1. ఫాస్ట్‌ ఎక్స్‌ (హాలీవుడ్‌) జూన్‌ 29న విడుదల


ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఈ సిరీస్‌లో 9 చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘ఫాస్ట్‌ X’ పేరుతో 10 మూవీ వచ్చింది. మే 18న విడుదలై ప్రేక్షకులను అలరించింది.  జూన్ 29న ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.


జియో సినిమా


1. సార్జెంట్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 30న విడుదల


ఆహా


1. అర్థమైందా అరుణ్‌కుమార్‌ (తెలుగు సిరీస్‌) జూన్‌ 30న విడుదల


ఆహాలో 'అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్' తెలుగు వెబ్ సిరీస్ జూన్‌ 30న స్ట్రీమింగ్ కానుంది. హర్షిత్ రెడ్డి, తేజస్వి,  అనన్య ప్రధానమైన పాత్రలు పోషించారు. కార్పొరేట్ ఆఫీసులో జాబ్స్, అక్కడి టెన్షన్స్, ప్రేమ వ్యహారాల కథాంశంతో తెరకెక్కించారు.   



Read Also: తెలుగు పాటలు వింటూ జిమ్‌లో అకిరా వర్కౌట్స్ - కొడుకును చూసి మురిసిపోతున్న రేణూ దేశాయ్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial