అకీరా నందన్. పవణ్ కల్యాణ్, రేణూ దేశాయ్ ముద్దుల కొడుకు. బయట చాలా తక్కువగా కనిపిస్తాడు. మెగా ఫ్యామిలీలో జరిగే ఆయా వేడుకలు, కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తుంటాడు. తల్లి అకీరాను కొంగు చాటు కొడుకుగా పెంచుతోంది. అయితే, అకీరా ఎక్కవ కనిపించినా సోషల్ మీడియాలో ఇట్టే వార్తలు వైరల్ అవుతాయి. ఆయన ఫోటోలు ట్రెండింగ్ లోకి వస్తాయి. అకీరా ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు? సినిమాలు ఇష్టం లేకపోతే ఏం చేస్తాడు? అని తెగ చర్చలు నడుస్తాయి. నిజానికి చాలా కాలంగా అకీరా సినిమాల్లోకి వస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తల్లి రేణూ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో ఆయన నటించాడు. ఆయన నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే సినిమాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
అకీరాను చూస్తుంటే గర్వంగా ఉంది- రేణు
కాసేపు ఆయన సినిమాల విషయం పక్కన పెడితే, మరోసారి అకీరా నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు. తాజాగా జిమ్ లో పాటలు వింటూ వర్కౌట్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను తల్లి రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాదు, తెలుగు పాటలు వింటున్న అకీరాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ కాలం యువత కూడా మాతృభాషను గౌరవిస్తారని ఆశిస్తున్నానని రేణూ క్యాప్షన్ పెట్టింది. “చాలా మంది జిమ్ చేసే సమయంలో గట్టి గట్టిగా ఇంగ్లీష్ పాటలు పెట్టుకుని వింటుంటారు. కానీ, ఆ ట్రెండ్ కు బదులుగా జిమ్ చేసే సమయంలో తెలుగు పాటలు వినమని నేను ఎప్పుడూ అకీరాకు చెప్తుంటాను. నేను వర్కౌట్ చేసే సమయంలో మాత్రం హిందీలో పాటలను వింటుంటాను. అకీరా మాదిరిగానే యువ తరం వారి మాతృభాషలో పాటలు వినయడంతో పాటు ఆ భాషను కొనసాగించాలని కోరుకుంటున్నాను” అని రేణూ దేశాయ్ రాసుకొచ్చారు.
పవన్, రేణు- ప్రేమ, పెళ్లి, విడాకులు!
ఇక పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ లు సినిమా షూటింగ్ సందర్భంలో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల సహజీవనం తర్వాత వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో 2012లో విడిపోయారు. అప్పటి నుంచీ ఎవరి లైఫ్ ను వాళ్లు గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటుందీ అంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా కొంత మంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై ఆమె కూడా ఘాటుగానే స్పందించారు.
Read Also: పంథానికి వస్తే అంతం చూస్తా- భీమ్ రావ్ దొరగా నటవిశ్వరూపం చూపించిన జగపతిబాబు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial