Prithviraj Sukumaran : మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ చిత్రం 'విలయత్ బుద్ధ' షూటింగ్‌లో చిన్న ప్రమాదానికి గురయ్యాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్ గాయాలు కావడంతో సోమవారం ఉదయం కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాలికి కీహోల్ శస్త్రచికిత్స చేయనున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే పృథ్వీరాజ్ కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు గానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా పృథ్వీరాజ్‌కు గాయమైందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రమాదం నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా పృథ్వీరాజ్ గాయపడడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాలార్' లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ కానుంది. అయితే పృథ్వీరాజ్ కు గాయం కావడం.. 'సాలార్' విడుదలపై ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే 'సాలార్' చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటన చేయాల్సిందేనని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ చివరిగా 'షాజీ కైలాస్' దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'కాపా'లో కనిపించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్... 'ఆడుజీవితం', 'సాలార్', 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా అవి ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న 'విలయత్ బుద్ధ' చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరో వంద రోజుల్లో
ప్రభాస్, శృతి హాసన్ నటించిన 'సాలార్; చిత్రం కౌంట్ డౌన్ మొదలైంది. దాదాపు మరో వంద రోజులలో ఈ సినిమా విడుదల కాబోతుంది ఇటీవలే చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. ఇప్పటికే ప్రభాస్ సినిమా ఆదిపురుష్ వివాదాల్లో ఉండగా.. ఈ సినిమాను ఓం రౌత్ సరిగా తీయలేదని అందరూ ఆరోపిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రాజకీయ పార్టీ అనుబంధ సంస్థ అండగా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial