సరికొత్త కథలతో సినిమాలు చేయడంలో ముందుంటారు యంగ్ హీరో శ్రీ విష్ణు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  ‘బిగిల్’ సినిమాలో ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబా జాన్ ఈ చిత్రంలో హీరోయిన్. ఈ సినిమాను హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.


ఫుల్ ఫన్నీగా 'సామజవరగమన' ట్రైలర్


త్వరలో 'సామజవరగమన' సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిప్స్, పాటలతో పాటు టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.  ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో నిండిపోయింది.


శ్రీవిష్ణు పంచులకు ప్రేక్షకులు పడిపడి నవ్వుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయిలతో హీరో రాఖీ కట్టించుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ ను పని మనుషులలా చూడటం ఫన్నీగా అనిపిస్తుంది. అమ్మాయిల మీద ప్రేమ కలగకపోవడానికి గల కారణం చెప్పి నవ్విస్తారు. ప్రేమించిన అమ్మాయిలతో పడే ఇబ్బందులను, పెళ్లి చూపులలో ఎదురయ్యే వింత అనుభవాలు అందరినీ బాగా నవ్విస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ ను వాడు ‘కేజీఎఫ్’ సినిమాలో బానిసల్లా చూస్తాడంటూ హీరో విష్ణు గురించి సీనియర్ నటుడు నరేష్ చెప్పే మాటలు అందరినీ పడీ పడీ నవ్వేలా చేస్తాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఈ దెబ్బతో శ్రీవిష్ణు ఖాతాలో మంచి హిట్ పడటం ఖాయం అంటున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.



ఆకట్టుకున్న టీజర్, లిరికల్ సాంగ్


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు లిరికల్ సాంగ్ ను కూడా సినీ అభిమానులను అలరించింది. 'ఏం బోర్ కొట్టిందో' అంటూ సాగే ఈ పాటలో  హీరో మందుకొట్టి  ఫ్రెండ్స్ తో కలిసి చిందులేస్తూ కనిపిస్తాడు. గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. జెస్సీ గిఫ్ట్ ఈ పాటను పాడారు.  ట్రైలర్ మాదిరిగానే టీజర్ కూడా అందరినీ బాగా నవ్వించింది.  






శ్రీవిష్ణు ఆశలన్నీ 'సామజవరగమన' పైనే!


శ్రీవిష్ణు ఇప్పటి వరకు 10 సినిమాలు చేశారు. అందులో ముచ్చటగా మూడు సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఒకప్పుడు ఈయనతో సినిమా చేస్తే మినిమం హిట్ గ్యారెంటీ అనుకునే వారు దర్శకనిర్మాతలు. కానీ, ఆ తర్వాత పూర్తిగా ఫ్లాప్ సినిమాలు చేయడంతో తెరమరుగు కావడం ఖాయం అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే 'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'రాజ రాజ చోర' మూవీ తర్వాత శ్రీవిష్ణుకి ఇంతవరకూ హిట్ దక్కలేదు. ఈ సినిమాతో ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.


Read Also: 'ఆదిపురుష్' చూశాక 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది - వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial