31 Years Of Shah Rukh Khan : 'కింగ్ ఆఫ్ రొమాన్స్'గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రోజుతో (జూన్ 25) 31 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఇన్నేళ్ల ఆయన సినీ ప్రయాణంలో... ఎన్నో హిట్స్, ప్లాపులు ఆయనను పలకరించాయి. విమర్శలను సైతం స్పోర్టివ్ గా తీసుకొని... విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా షారూఖ్ దూసుకు పోతున్నారు. ఈ జర్నీలో షారూఖ్ ఎన్నో యాక్షన్, లవ్ స్టోరీ, కామెడీ సినిమాల్లో నటించారు. విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. షారుఖ్ నటించిన సినిమాల్లో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న, ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిన బెస్ట్ రొమాంటిక్ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.


'వీర్-జారా'


'వీర్-జారా' ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న టైమ్‌లెస్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో వీర్, జారా మధ్య ప్రేమ, త్యాగాన్ని అందంగా చూపించారు. వీర్ పాత్రలో షారుఖ్ నటించిన తీరును ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. జారా పాత్రలో హీరోయిన్ ప్రీతీ జింటా నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విమర్శకుల చేత సైతం ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి.


'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే'


'దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ రొమాంటిక్ హీరోగా, లవర్ బాయ్ గా కనిపించారు. రాజ్ పాత్రలో షారుఖ్ నటించగా... నటి కాజోల్ తో అతని కెమిస్ట్రీ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రంలోని కొన్ని ఐకానిక్ డైలాగ్ లు, మనోహరమైన సంగీతం, ఎవర్ గ్రీన్ గా నిలిచే ప్రేమకథ... ఇవన్నీ ఇప్పటికీ ఆదరణను పొందుతూనే ఉన్నాయి.


'కల్ హో నా హో'


రొమాన్స్, కామెడీ అండ్ డ్రామా నేపథ్యంలో సాగే 'కల్ హో నా హో' ... ప్రేక్షకులకు భావోద్వేగ అనుభూతిని కలిగిస్తుంది. అమన్ మాథుర్ గా షారుఖ్ నటించిన తీరు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. తన జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే సమయంలో వచ్చే సన్నివేశాలు సినీ లవర్స్ ను కట్టిపడేస్తాయి. ఈ మూవీలో కామెడీ అందరినీ నవ్వించింది. దాంతో ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా నిలిచింది.


మొహబ్బతీన్


కఠినమైన సామాజిక నిబంధనలపై ప్రేమ సాధించిన విజయాన్ని 'మొహబ్బతీన్'లో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది. సంగీత ఉపాధ్యాయుడిగా షారుఖ్, రాజ్ ఆర్యన్ పాత్రలో మెప్పించారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూడా నటించడం మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. 27 అక్టోబరు 2000న విడుదలైన ఈ సినిమా... ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది.


కుచ్ కుచ్ హోతా హై


ప్రేమ, స్నేహం మధ్య జరిగే సాగే భావోద్వేగాల సమ్మేళనం 'కుచ్ కుచ్ హోతా హై'. రాహుల్ ఖన్నా పాత్రలో షారుఖ్ నటించగా... కాలేజీ రోజుల్లో హీరోయిన్ తో స్నేహం, ఆ తర్వాత మరో హీరోయిన్ తో పెళ్లి, వారికి  పుట్టిన బిడ్డతో సాగే భావోద్వేగ సన్నివేశాలు, ఆ తర్వాత మళ్లీ కాలేజ్ డేస్ లో విడిపోయిన హీరోయిన్ కాజల్ కలవడం, చివరికి వారిద్దరూ ఒకటి కావడం... ఇవన్నీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఈ సినిమా SRK కెరీర్ లోనే మరపురాని చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది.


Also Read : ప్రభాస్‌ సినిమాలో కమల్ హాసన్ - కన్ఫర్మ్ చేసిన 'ప్రాజెక్ట్ కె' టీమ్


ఈ ఏడాది జనవరిలో రిలీజైన 'పఠాన్'తో షారుఖ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. త్వరలో 'జవాన్'తో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది.


Read Also : Prabhas - Lokesh Kanagaraj : ప్రభాస్ హీరోగా లోకేష్ కనగరాజ్ సినిమా - తమిళ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసిన దర్శకుడు?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial