భారతీయ చిత్ర సీమలో భారీ మల్టీస్టారర్ రాబోతోంది. బహుశా... ఇంతమంది స్టార్స్ మరో సినిమాలో కనిపించడం కష్టమేనేమో!? ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' తారాగణంలో మరో లెజెండ్ పేరు చేరింది. లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 


అవును... 'ప్రాజెక్ట్ కె'లో కమల్!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K Movie). ఈ సినిమాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్‌లో ఒకరైన అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఆ సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా వచ్చారు. 


'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ (Prabhas)కు ధీటైన ప్రతినాయకుడిగా కమల్ హాసన్ (Kamal Haasan) నటించనున్నారని కొన్ని రోజులుగా వినపడుతోంది. విలన్ అని చిత్ర బృందం చెప్పలేదు గానీ సినిమాలో కమల్ ఉన్నారని కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలు పెట్టారు.






'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ కనిపించనున్నారు. దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న సినిమా విడుదల చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. 


కమల్ హాసన్ సన్నివేశాలే బ్యాలన్స్!? 
'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ దాదాపు 70 శాతం కంటే ఎక్కువ పూర్తి అయ్యింది. కమల్ హాసన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ సీన్స్ ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే పూర్తి అవుతాయని తెలిసింది. 


కమల్ రెమ్యూనరేషన్ 150 కోట్లు?
'ప్రాజెక్ట్ కె'లో ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నందుకు కమల్ హాసన్ (Kamal Haasan Remuneration Project K)కు భారీ పారితోషికం ఇస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయనకు 150 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. 'విక్రమ్' విజయంతో కమల్ హాసన్ పూర్వ వైభవం అందుకున్నారు. వందల కోట్లు వసూలు చేయగల స్టార్లలో ఆయన కూడా ఒకరని, ఆ ఇమేజ్ చెక్కు చెదరలేదని 'విక్రమ్' ప్రూవ్ చేసింది. అందువల్ల, అన్ని కోట్లు ఆఫర్ చేశారని సమాచారం.


Also Read : ఐదేళ్ళ పాటు 'దిల్' రాజును ఆదుకున్న పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'


కమల్ హాసన్ హీరోగా నటించిన 'అపూర్వ సోదరులు', 'మైఖేల్ మదన్ కామరాజు' చిత్రాలకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా టైమ్ ట్రావెల్ సినిమా 'ఆదిత్య 369' చేసిన అనుభవం ఆయన సొంతం. 'ప్రాజెక్ట్ కె' సైతం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమే. అందుకని... సింగీతం శ్రీనివాసరావు సలహాలు, సూచనలు నాగ్ అశ్విన్ తీసుకుంటున్నారు. కమల్ క్యారెక్టర్ వెనుక ఆయన సలహా ఉందేమో!?


Also Read : నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial