పాన్ ఇండియా సినిమా అంటే భారీ బడ్జెట్ కావాలి! అందులోనూ గ్యాంగ్‌స్టర్ డ్రామా, యాక్షన్ సినిమా అంటే వందల కోట్లు అవసరం! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ఫ్యాన్ బాయ్ సుజీత్ అటువంటి సినిమా తీస్తున్నారని నటీనటులు చెప్పే మాటలను బట్టి అర్థం అవుతోంది. 'ఓజీ' బడ్జెట్ నాలుగు వందల కోట్లు దాటుతుందని నటుడు కమల్ చెబుతున్నారు. 


నాలుగు, ఐదు వందల కోట్లతో 'ఓజీ' సినిమా!?
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ (Sujeeth Director) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). They Call Him OG... అనేది ఉప శీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ ముంబైలో ఓ వారం షెడ్యూల్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చేస్తున్నారు. 


లేటెస్టుగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు కమల్... 'ఓజీ'లో తాను ఓ పాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ముంబైలో జరిగిన చిత్రీకరణలో పాల్గొన్నానని, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ గెటప్ అద్భుతమని చెప్పారు. ఇక, డీవీవీ దానయ్య నిర్మాణంలో రాజీ పడటం లేదన్నారు. బడ్జెట్ ఎంత? అని ప్రశ్నించగా... 'పూర్తి వివరాలు నాకు తెలియవు. కానీ, 400 - 500 కోట్లు ఉంటుంది' అని కమల్ చెప్పారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






విజువల్స్ చూశా... మతి పోయింది! - అర్జున్ దాస్
'బుట్ట బొమ్మ'తో తెలుగు తెరకు పరిచయమైన తమిళ నటుడు అర్జున్ దాస్ (Arjun Das). ఆ సినిమా విడుదలకు ముందు తెలుగులో డబ్బింగ్ అయిన కోలీవుడ్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. 'ఓజీ'లో అర్జున్ దాస్ కూడా నటిస్తున్నారు. 


దర్శకుడు సుజీత్ తనకు కొన్ని విజువల్స్ చూపించారని, అవి చూస్తే మతి పోయిందని అర్జున్ దాస్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్, ఆ స్వాగ్, డైలాగ్స్ ఫైర్ అని పేర్కొన్నారు. అర్జున్ ట్వీట్ పవర్ స్టార్ అభిమానులను ఖుషి చేసింది. 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. ఇందులో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. స్క్రిప్ట్ వినడం స్టార్ట్ చేసిన ఐదు నిమిషాలకు విపరీతంగా నచ్చిందని, దాంతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని ఆమె చెప్పారు.


Also Read : డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న అషు రెడ్డి - ఫోన్ నంబర్ బయట పెట్టొద్దని వార్నింగ్!



డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య 'ఓజీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. 'సాహో' తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే. 'ఆర్ఆర్ఆర్', 'సాహో' పాన్ ఇండియా రిలీజ్ అయ్యాయి. ఈ 'ఓజీ'ని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. డిసెంబర్ నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. దాని కంటే ముందు జూలై నెలాఖరున 'బ్రో' థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తాయి. 


Also Read 'టీకూ వెడ్స్ షేరు' రివ్యూ : ఇండస్ట్రీ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా - నిర్మాతగా కంగనా రనౌత్ తొలి అడుగు హిట్టేనా?