తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. ఈ నెల 13వ తేదీన ఓ ఛోటా నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరి (KP Chowdary)ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన విచారించగా... పలు సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు తెలిసింది. 


తెలుగు చిత్రసీమలో కొంత మంది నటీమణులతో కేపీ చౌదరి వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు, అందులో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు, 'బిగ్ బాస్' రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి (Ashu Reddy) కూడా ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ కేసు మీద ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. 


ఫోన్ నంబర్ బయటపెడితే సహించేది లేదు! - అషు రెడ్డి
కొంత మంది (కేపీ చౌదరి)తో తన పేరును ముడి పెడుతూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అషు రెడ్డి పేర్కొన్నారు. దానిని తాను తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. నిజానిజాలు ఏమిటో సంబంధిత అధికారులకు వెల్లడిస్తానని అషు రెడ్డి వివరించారు. తన ఫోన్ నంబరును పబ్లిగ్గా పోస్ట్ చేస్తే సహించనని సున్నితంగా హెచ్చరికలు జరీ చేశారు. ఈ వివరణతో ఓ స్ఫష్టత వస్తుందని ఆశిస్తున్నట్లు అషు రెడ్డి పేర్కొన్నారు. 


Also Read : 'అశ్విన్స్' రివ్యూ : 'విరూపాక్ష'లా భయపెట్టిందా? SVCCకి మరో హిట్ వస్తుందా?






అషు రెడ్డి మాత్రమే కాదు... ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణితో పాటు మరో నటి జ్యోతితో కేపీ చౌదరి వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ప్రముఖ నిర్మాత 'ఠాగూర్' మధు, బెజవాడ భరత్, తేజ, రఘుతేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్ తదితరుల పేర్లు బయటకు వచ్చాయి. అషురెడ్డి స్పందించినట్లు మిగతా వ్యక్తులు ఎవరూ స్పందించలేదు. 


సెలబ్రిటీలకు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించిన కేపీ!
కేపీ చౌదరి సంచలన విషయాలు బయట పెట్టినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పన్నెండు మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి  అంగీకరించాడని, అందులో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ''బెజవాడ భరత్, తేజ, రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, ఠాగూర్ ప్రసాద్, శ్వేత నా దగ్గర డ్రగ్స్ కొన్నారు'' అని కేపీ చౌదరి వెల్లడించినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.


Also Read 'టీకూ వెడ్స్ షేరు' రివ్యూ : ఇండస్ట్రీ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా - నిర్మాతగా కంగనా రనౌత్ తొలి అడుగు హిట్టేనా?



కేపీ చౌదరి కొంత కాలంగా గోవాలో ఉంటున్నారు. ఆయన డ్రగ్స్ వాడుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తుల వివరాలు సేకరించారు. అక్కడ కేపీ చౌదరి పేరు బయటకు వచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేయగా... మరింత మంది పేర్లు బయటకు వచ్చాయి. దేశంలో ఇతర ప్రాంతాలకు గోవా కేంద్రంగా డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సిటీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తుల మూలాలను గుర్తించిన పోలీసులు... మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ ను సైతం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.