Top 5 SUVs in May 2023: గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశ ప్రజలు ఎస్‌యూవీ కార్లను చాలా ఇష్టపడటం ప్రారంభించారు. దీంతో ఈ కార్ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు సాయపడింది. గత నెలలో కూడా ఎస్‌యూవీల విభాగంలో భారీగా విక్రయాలు జరిగాయి. 2023 మే నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాను చూద్దాం.


టాటా నెక్సాన్
ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. 2023 మే నెలలో మొత్తం 14,423 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఒక శాతం తక్కువ. 2022 మేలో టాటా నెక్సాన్ 14,614 యూనిట్లు అమ్ముడు పోయాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.80 లక్షల నుంచి రూ. 14.50 లక్షల మధ్యలో ఉంది. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.


మారుతీ సుజుకి బ్రెజా
గత ఏడాది విడుదల చేసిన కొత్త తరం మారుతి బ్రెజా గత నెలలో 13,398 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 14.14 లక్షల మధ్యలో ఉంది. దీని విక్రయాలు టాటా నెక్సాన్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి.


టాటా పంచ్
ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో టాటా నుంచి వచ్చిన ఈ మైక్రో ఎస్‌యూవీ అమ్మకాల పరంగా కూడా చాలా ముందుంది. 2023 మేలో ఈ కారుకు సంబంధించి 11,124 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2022 మే కంటే తొమ్మిది శాతం ఎక్కువ. టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.52 లక్షల మధ్యలో ఉంది.


హ్యుందాయ్ వెన్యూ
2023 మేలో హ్యుందాయ్ వెన్యూ విక్రయాలు 23 శాతం పెరిగి 10,213 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 మేలో హ్యుండాయ్ వెన్యూ 8,300 యూనిట్లు మాత్రమే విక్రయించారు. కంపెనీ గత ఏడాది దీన్ని అప్‌డేట్ చేసింది. హ్యుందాయ్ వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.72 లక్షల నుంచి రూ.13.18 లక్షల మధ్యలో ఉంది.


మారుతీ సుజుకి ఫ్రాంక్స్
మారుతీ సుజుకి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కారును విడుదల చేసింది. 2023 మేలో ఈ కారుకు సంబంధించి 9,863 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.46 లక్షల నుంచి రూ. 13.13 లక్షల మధ్యలో ఉంటుంది.


ప్రస్తుతం మనదేశంలో ప్రతి నెలా లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది కూడా. కొత్త కారు కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరతో పాటు వినియోగదారులు చాలా పన్నులు, ఇతర ఛార్జీలు చెల్లించాలి. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే కొంత డబ్బు ఆదా చేసుకోవడానికి అవసరమైన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.


కార్ల తయారీదారులు తమ అనేక మోడళ్లపై తరచుగా వివిధ రకాల ఆఫర్‌లను అందిస్తారు. వీటిని డీలర్‌షిప్‌లో కస్టమర్లకు ఎక్కువగా వెల్లడించరు. అటువంటి పరిస్థితిలో వాహనం కొనుగోలు చేయడానికి ముందు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మీకు ఇష్టమైన కారుపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్‌ను చెక్ చేసుకోండి.










Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!