World Cup 2023, ZIM vs USA: ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్వాలిఫయర్ రౌండ్‌లో జింబాబ్వే 304 పరుగుల భారీ తేడాతో అమెరికాను ఓడించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద విజయం. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం అమెరికా జట్టు కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. దీంతో జింబాబ్వే 304 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ మెరుపు ఇన్నింగ్స్
అంతకుముందు టాస్ గెలిచిన యూఎస్ఏ జట్టు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 408 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ షాన్ విలియమ్స్ 101 బంతుల్లో 174 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో వన్డే క్రికెట్‌లో జింబాబ్వే తొలిసారి 400 పరుగుల మార్కును దాటింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జింబాబ్వే, యూఎస్ఏ జట్లు తలపడ్డాయి.
వన్డే క్రికెట్ చరిత్రలో జింబాబ్వే అతిపెద్ద విజయం
జింబాబ్వే 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 408 పరుగులు సాధించింది. మరోవైపు అమెరికా జట్టు కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. ఈ విధంగా తన వన్డే క్రికెట్ చరిత్రలోనే జింబాబ్వే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఓవరాల్‌గా చూసుకుంటే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద విజయం. 2023 ప్రారంభంలో శ్రీలంకను టీమిండియా 317 పరుగులతో ఓడించింది. అదే వన్డేల్లో అతి పెద్ద విజయంగా ఉంది
ఇక జింబాబ్వే విషయానికి వస్తే... అంతకుముందు 1999లో ఢాకా మైదానంలో జింబాబ్వే 202 పరుగుల తేడాతో కెన్యాను ఓడించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, సికందర్ రజా రెండేసి వికెట్లు తీశారు. బ్రాడ్ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ర్యాన్ బర్ల్ తలో వికెట్ పడగొట్టారు.
వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయాలు
భారత్ (317 పరుగులు) - ప్రత్యర్థి శ్రీలంక, తిరువనంతపురం (వేదిక), 2023
జింబాబ్వే (304 పరుగులు) - ప్రత్యర్థి అమెరికా, హరారే (వేదిక), 2023
న్యూజిలాండ్ (290 పరుగులు) - ప్రత్యర్థి ఐర్లాండ్, అబెర్డీన్ (వేదిక), 2008
జింబాబ్వేకు వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయాలు
304 పరుగులు వర్సెస్ అమెరికా, హరారే (వేదిక), 2023
202 పరుగులు వర్సెస్ కెన్యా, ఢాకా (వేదిక), 1999