Top 10 News Today: 


1. చెరువుల వద్ద సీసీ కెమెరాలు: రేవంత్‌


సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, మెట్రో రైలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలు సేకరించాలని, వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



2. విచారణకు రేవంత్‌ హాజరుకావాల్సిందే


నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో అక్టోబర్‌ 16న విచారణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. నేడు జరిగిన విచారణకు మత్తయ్య సహా మిగిలిన నిందితులు గైర్హాజరయ్యారు. వారు విచారణకు రాకపోవడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



3. మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందజేసిన సీఎం


ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం ధ్రువపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ప్రభుత్వం హయత్ నగర్‌లో 600 చ. గజాల స్థలాన్ని కేటాయించగా, అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సీఎం అందించారు. స్థలం పత్రాలను అందించినందుకు ఈ సందర్భంగా మొగిలయ్య.. సీఎం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



4. వైసీపీ విధేయులను వెంటాడుతున్న కేసులు


గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నేతలతో పాటు అధికారులకూ చిక్కులు తప్పడం లేదు. ఇప్పటికే నటి జెత్వానీ కేసులో పోలీసు అధికారులు చిక్కుల్లో పడగా.. ఇప్పుడు రఘురామ కేసు వెంటాడుతోంది. రఘురామ కేసులో అప్పటి సీఐడీ అధికారి విజయ్‌పాల్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం విజయ్ పాల్ పరారీలో ఉండగా.. ఈ కేసులో జగన్‌తోపాటు ఉన్న అధికారులకు చిక్కులు తప్పేలా లేవు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



5. రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా


వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీసీ సంక్షేమ సంఘ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆర్. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. ఆర్. కృష్ణయ్య బీజేపీలో చేరుతారని.. సొంతంగా పార్టీ పెడతారని ఊహాగానాలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



6. లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు.. చీఫ్ ఎవరంటే..?


తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు చీఫ్‌గా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమించింది. త్రిపాఠి ప్రస్తుతం గుంటూరు రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. సిట్‌లో సభ్యులుగా గోపినాథ్ శెట్టి, హర్షవర్దన్ రాజును నియమించింది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని.. దోషులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



7.శ్రీవారి లడ్డూ వివాదంలో బద్రి వర్సెస్ నందా


తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ వివాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతోంది. పవన్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తొలుత పవన్ చేసిన ట్వీట్‌కి ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. దుర్గ గుడికి వచ్చిన పవన్.. ఈ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ రియాక్షన్‌పై తాజాగా ప్రకాశ్ రాజ్ రియాక్టయ్యారు. మెగా ఫ్యామిలీకి ఆప్తుడిగా ఉండే ప్రకాశ్‌రాజ్ ఇలా స్పందించడం వైరల్‌గా మారింది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



8.కార్తీని అభినందించిన పవన్ కళ్యాణ్


శ్రీవారి లడ్డూ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై హీరో కార్తీ సారీ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి అభినందించారు. కార్తీ వేగంగా స్పందించిన తీరును, మన సంప్రదాయాల పట్ల ఆయన చూపిన గౌరవాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. అంతేకాక, సత్యం సుందరం సినిమా విడుదల సందర్భంగా ఆ సినిమా విజయవంతం కావాలని కార్తీకి, సూర్యకు, జ్యోతికకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



9. లైంగిక వేధింపులపై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు


సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కీలక సూచనలు చేశారు. పరిశ్రమలో లైంగిక వేధింపులు తగ్గాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కొత్తవారికి ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? వేధింపులు ఎదురైతే కమిటీకి ఎలా చెప్పాలి? అనే విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త నటులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


10. హర్షసాయిపై రేప్ కేసు నమోదు


పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు నమోదైంది. నగ్న చిత్రాలు, వీడియోలతో తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని యువతి ఫిర్యాదు చేశారు. తన వద్ద రూ. 2 కోట్ల రూపాయలు తీసుకుని.. తర్వాత తనను మోసం చేశాడని ఆరోపించారు. యువతి ఫిర్యాదుతో యూట్యూబర్‌ హర్షసాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


Also Read: హైడ్రా కూల్చివేతలతో నష్టపోతోంది చివరి కొనుగోలుదారులే - అసలు దోషులు సేఫేనా ? బాధితులకు న్యాయం ఎలా ?