Prakash Raj and Pawan Kalyan On Tirupati Laddu Issue : తిరుపతి లడ్డూ కల్తీ అంశం ప్రకాష్ రాజ్ , పవన్ కల్యాణ్ ల మధ్య కొత్త వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. దుర్గమ్మ గుడిలో మెట్లు శుభ్రం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడిన సమయంలో ప్రకాష్ రాజ్ తనపై చేసిన ట్విట్టర్ కామెంట్లపై మండిపడ్డారు. తాను ప్రకాష్ రాజ్ ను ఎంతో గౌరవిస్తానన్నారు. అయితే తాను తిరుపతి లడ్డూ విషయంపై స్పందిస్తే.. ఆయన కించపరిచేలా మాట్లాడారని..సహించేది లేదన్నారు. పవన్ కల్యాణ్ విమర్శలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. నేపాల్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచి తన సోషల్ మీడియాలో ఖాతాలో వీడియో పోస్టు చేశారు.
తాను చెప్పిన అంశాన్ని పవన్ కల్యాణ్ వేరేగా అర్థం చేసుకున్నారని .. తన ట్వీట్‌ను మరోసారి చదవాలన్నారు. తాను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను 30 తారికు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తానన్నారు.
ఇంతకు మూడు రోజుల కిందట ముందు పవన్ కల్యాణ్.. లడ్డూ ఇష్యూపై స్పందించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలన్నారు.
పవన్ స్పందనపై ప్రకాష్ రాజ్ స్పందించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగిందని.. నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి కానీ అంతేకానీ, లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు.
ఈ ట్వీట్ పైనే విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర ఘాటుగా స్పందించారు. రంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది.. కానీ ఇలాంటి విషయాల్లో ఇలా మాట్లాడితే బాగుండదు.. సెక్యూలరిజం అంటే టూ వే.. వన్ వే కాదు అని మండిపడ్డారు.
నెలాఖరులో.. ప్రకాష్ రాజ్ హైదరాబాద్‌కో .. విజయవాడకో వచ్చి స్పందించిన తర్వాత దీనిపై మరింత రాజకీయం రాజుకునే అవకాశం ఉంది.