Andhra HC denies Anticipatory bail to former CID SP Vijay Pal : వైఎస్ఆర్‌సీపీ నేతలతో పాటు ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకూ చిక్కులు తప్పడం లేదు. తాజాగా సీఐడీలో పని చేసి రిటైరైన విజయ్‌పాల్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. రఘురామ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినప్పటి నుంచి విజయ్ పాల్ అందుబాటులో లేరు. పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. ఆయన కుటుంబసభ్యులు కూడా విజయ్ పాల్ గురించిన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి పోలీసుల తరపు న్యాయవాది తీసుకెళ్లారు. పలుమార్లు విచారణ తర్వాత ముందస్తు బెయిల్ తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. 


ప్రస్తుతం పరారీలో ఉన్న  విజయ్ పాల్  


ప్రస్తుతం విజయ్ పాల్ ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియడం లేదు. ముందస్తు  బెయిల్ కూడా హైకోర్టు నిరాకరించినందున ాయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆయన గత ప్రభుత్వ  హయాంలోనే రిటైర్ అయ్యారు అయితే  సీఐడీలో ఆఫీసర్ ఆన్  స్పెషల్ డ్యూటీగా రిటైర్మెంట్ అనంతరం నియమించారు.  ఆ తర్వాత రఘురామకృష్ణరాజు మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఇది రాజద్రోహం అని .. సుమోటోగా విజయ్ పాల్ కేసు నమోదు చశారు.  హైదరాబాద్‌లో పుట్టిన రోజు జరుపుకుంటున్న  రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి ఏపీకి తీసుకెళ్లారు.   


హీరోయిన్ జెత్వానీపై ముగ్గురు ఐపీఎస్‌ల కుట్ర - కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు


వివాదాస్పదమైన రఘురామ కృష్ణరాజు అరెస్టు వ్యవహారం 


ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం కానీ.. నోటీసులు ఇవ్వడం కానీ చేయలేదని ఉద్దేశపూర్వకంగా తనను కిడ్నాప్ చేసినట్లుగా తీసుకెళ్లారని రఘురామ ఆరోపిస్తున్నారు.  సాధారణంగా  హైదరాబాద్‌లో అరెస్టు చేస్తే.. అక్కడ కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్తారు.. అది కూడా చేయలేదని..  అరెస్టు చేసిన రోజు రాత్రి సీఐడీ ఆఫీసులో ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు. దాంతో న్యాయమూర్తి .. వైద్య పరీక్షలకు ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో  వైద్య రిపోర్టులన్నీ  తారుమారు చేశారని ఆరోపణలు రావడంతో  సికింద్రాబాద్ సైనిక ఆస్పత్రిలో టెస్టులు చేయించారు. అక్కడ రఘురామకు గాయాలు ఉన్నట్లుగా రిపోర్టు రావడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 



Also Read: Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు



జగన్ తో పాటు నిందితులుగా పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ 


తనపై కస్టోడియల్ టార్చర్ విషయంలో సీబీఐ విచారణ కోసం ఇప్పటికే హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇంకా నిర్ణయం రాలేదు. ఈ లోపు ప్రభుత్వం మారడంతో తనను అక్రమంగా  అరెస్టు చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారనిగుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో  మాజీ సీఎం జగన్ తో పాటు.. పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ కూడా ఉన్నారు. వారు ఇంకా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోలేదు. విజయ్ పాల్ ముందస్తు  బెయిల్ పిటిషన్ ను తిరస్కరించినందున వీరికి కూడా చిక్కులు తప్పవని భావిస్తున్నారు.