ED court has issued summons to Revanth Reddy in Vote For Cash case : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులు చిక్కులు తప్పేలా లేవు. ఈ  కేసులో పెద్ద ఎత్తున అక్రమ నగదు చెలామణి జరిగిందని ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. వచ్చే నెల పదహారో తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని రేవంత్ రెడ్డి సహా నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు నిందితులు అందరూ డుమ్మా కొడుతున్నారు. మంగళవారం జరిగిన వాయిాకు కేవలం మత్తయ్య మాత్రమే  హాజరయ్యారు. దీంతో కోర్టు నిందితలందరూ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 


ఓటుకు నోటు కేసులో ఈడీ కూడా కేసు నమోదు 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ  తెలగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్న స్టీఫెన్సర్‌కు డబ్బులు ఎర చూపారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో ఆయన చాలా రోజు పాటు జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. అలా డబ్బులు ఎర చూపిన సమయంలో రూ. యాభై లక్షలు రేవంత్ దగ్గర బ్యాగులో ఉన్నాయి. దీంతో నగదు అక్రమ చెలామణి చేశారని ఏసీబీ ఈడీకి కేసు రిఫర్ చేసింది. ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ నోదు చేసిన కేసులో విచారణ జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎం అయినందున ఆ కేసును ఇతర రాష్ట్రాలకు  బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఈ కేసు దర్యాప్తు, విచారణ విషయంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. 


పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!


నిందితులు హాజరు కాకపోతూండటంతో విచారణ ఆలస్యం 


ఇదే కేసులలో ఈడీ దాఖలు చేసిన కేసులో విచారణ నెమ్మదిగా సాగుతోంది. కోర్టుకు నిందితులు సరిగ్గా హాజరు కావడం లేదు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత ప్రచారకర్త జెరూసలేం మత్తయ్య మాత్రం అటు ఏసీబీ కేసులోనూ.. ఇటు ఈడీ కేసులోనూ రెగ్యులర్ కోర్టుకు హాజరవుతున్నారు. ఇతరులు ఎవరూ హాజరు కాకుండా..హాజరు మినహాయింపు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో కోర్టు వచ్చే నెల పదహారో తేదీన నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 


అక్టోబర్ 16న హాజరు కాక తప్పదా? 


ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పొజిషన్‌లో ఉన్నందున కోర్టుకు  హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఆయన తరపున లాయర్ హాజరయ్యేలా ఈడీ కోర్టులోనో లేకపోతే హైకోర్టులోనే పిటిషన్ వేసే ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. గతంలో ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో కూడా కోర్టుకు హాజరు కాలేదు. సీఎం బాధ్యతల కారణంగా ఆయన మినహాయింపు కోరుకున్నారు.